హర్షవర్ధన్ జాదవ్
హర్షవర్ధన్ జాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్రలోని కన్నాడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యాడు. హర్షవర్ధన్ జాదవ్ 2023 మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[2]
హర్షవర్ధన్ జాదవ్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 – 2019 | |||
నియోజకవర్గం | కన్నాడ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1978 | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన శివ సేన శివ స్వరాజ్య పక్ష | ||
జీవిత భాగస్వామి | సంజన జాదవ్[1] | ||
సంతానం | 1 | ||
నివాసం | ఫిషర్, కన్నాడ్, ఔరంగాబాద్ |
రాజకీయ జీవితం
మార్చుహర్షవర్ధన్ జాదవ్ 2004లో రాజకీయాల్లో చేరి, ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నాడ్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2009లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. హర్షవర్ధన్ జాదవ్ ఆ తరువాత శివసేన పార్టీలో చేరి 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హర్షవర్ధన్ జాదవ్ శివసేన పార్టీని విడి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. దీని ఫలితంగా శివసేన వరుసగా 4 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.[3] హర్షవర్ధన్ జాదవ్ సొంత పార్టీ "శివ స్వరాజ్య పక్ష/శివ స్వరాజ్య బహుజన్ పక్ష్" స్థాపించి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2020లో తిరిగి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీలో చేరి ఆ తరువాత 2023 మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Case against Danves daughter for threatening mother-in-law". Outlook India. PTI. 12 March 2020. Retrieved 7 September 2020.
- ↑ Namasthe Telangana (23 March 2023). "బీఆర్‌ఎస్‌లో 'మహా' చేరికలు". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.
- ↑ Firstpost (17 October 2019). "Ex-Shiv Sena MLA Harshvardhan Jadhav's Aurangabad house attacked, car, window panes damaged following remarks against Uddhav Thackeray" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
- ↑ The Times of India (24 March 2023). "Ex-Kannad MLA Jadhav joins BRS". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.