హలో మీరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించిన ఈ సినిమాకు కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 22న దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేయగా[1], ట్రైలర్‌ను నవంబర్ 4న విడుదల చేసి, సినిమాను 2023 ఏప్రిల్ 21న విడుదల చేశారు.[2]

హలో మీరా
దర్శకత్వంకాకర్ల శ్రీనివాస్
రచనకాకర్ల శ్రీనివాస్
మాటలుహిరన్మయి కళ్యాణ్
నిర్మాతడా. లక్ష్మణరావు దిక్కల
వరప్రసాదరావు దుంపల
పద్మ కాకర్ల
తారాగణం
ఛాయాగ్రహణంప్రశాంత్ కొప్పినీడి
కూర్పురాంబాబు మేడికొండ
సంగీతంఎస్ చిన్న
నిర్మాణ
సంస్థ
లూమియర్ సినిమా
విడుదల తేదీ
21 ఏప్రిల్ 2023 (2023-04-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మీరా గార్గేయి ఎల్లాప్రగడకి రెండు రోజుల్లో పెళ్లి అనగా తన మాజీ ప్రియుడి ఆత్మ హత్యకు ప్రయత్నించాడని పోలీసుల నుండి ఫోన్ వస్తుంది. ఆమెను పోలీసులు హైదరాబాద్ రమ్మంటారు. విజయవాడ నుంచి ఆ అమ్మాయి హైదరాబాద్ బయలుదేరడంతో ఆ దారిలో తనకు వచ్చే కాల్స్ ఏంటి ? అత్యవసరంగా పెళ్లి పనులు వదిలేసి హైదరాబద్ వెళ్లిపోవడంతో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు? ఆ అమ్మాయి పెళ్లి జరిగిందా ? సమస్య నుంచి బయటపడిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: లూమియర్ సినిమా
  • నిర్మాత: డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
  • లైన్ ప్రొడ్యూసర్: అనంత శ్రీధర్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కాకర్ల శ్రీనివాస్
  • సంగీతం: ఎస్ చిన్న
  • సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ కొప్పినీడి
  • మాటలు: హిరన్మయి కళ్యాణ్
  • ఎడిటర్: రాంబాబు మేడికొండ
  • పొడక్షన్ డిజైనర్: తిరుమల ఎం తిరుపతి
  • ప్రొడక్షన్ మేనేజర్స్: కత్రి మల్లేష్ , ఎం. రాంబాబు

మూలాలు

మార్చు
  1. Eenadu (22 October 2022). "హరీశ్‌ శంకర్‌ లాంఛ్‌ చేసిన 'హలో..మీరా.. ' టీజర్‌." Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.
  2. 10TV (1 April 2023). "ఒకేఒక్క క్యారెక్టర్‌తో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'హలో మీరా'.. రిలీజ్ డేట్ అనౌన్స్." Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=హలో_మీరా&oldid=3891224" నుండి వెలికితీశారు