హాజీ హుస్సేన్ అన్సారీ

హాజీ హుస్సేన్ అన్సారీ (జననం 1947 – 3 అక్టోబర్ 2020) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పని చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా పని చేశాడు.

హాజీ హుస్సేన్ అన్సారీ

మైనారిటీ సంక్షేమ మంత్రి
పదవీ కాలం
28 జనవరి 2020 – 3 అక్టోబర్ 2020
తరువాత హఫీజుల్ హసన్
నియోజకవర్గం మధుపూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1947 or 1950
పిప్రా, మధుపూర్, డియోఘర్ జార్ఖండ్, భారతదేశం
మరణం 3 అక్టోబర్ 2020
రాంచీ, జార్ఖండ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా
వృత్తి రాజకీయ నాయకుడు

హాజీ హుస్సేన్ అన్సారీ 1948 మార్చి 2న డియోఘర్ జిల్లాలోని మధుపూర్‌లోని పిప్రా గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం

మార్చు

హాజీ హుస్సేన్ అన్సారీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయలలోకి వచ్చి 1990లలో జేఎంఎంలో చేరాడు. ఆయన 1995లో సమైక్య బీహార్‌లోని మధుపూర్ శాసనసభ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పని చేసి ఆ తరువాత ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి 2000, 2009, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హాజీ హుస్సేన్ అన్సారీ 2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఆ తరువాత 2010లో అన్సారీ జార్ఖండ్ హజ్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు.

మంత్రిగా

మార్చు

హాజీ హుస్సేన్ అన్సారీ 2009లో శిబు సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో తొలిసారిగా ఆరు నెలల పాటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జేఎంఎం మద్దతుతో బీజేపీ నాయకత్వంలో అర్జున్ ముండా ప్రభుత్వం ఏర్పడ్డాక మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1] దాదాపు 38 నెలల పాటు ప్రభుత్వాన్ని నడిపిన అర్జున్ ముండా ప్రభుత్వం పడిపోయింది. దీని తర్వాత కాంగ్రెస్ మద్దతుతో హేమంత్ సోరెన్ నాయకత్వంలో ఏర్పడిన 13 నెలల సుదీర్ఘ ప్రభుత్వంలో ఆయన మైనారిటీ సంక్షేమ మంత్రిగా చేశాడు.[2]

హాజీ హుస్సేన్ అన్సారీ కరోనా సోకినట్లు గుర్తించిన తరువాత 2020 సెప్టెంబర్ 23న రాంచీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 3 అక్టోబర్ 2020న మరణించాడు.[3][4][5]


మూలాలు

మార్చు
  1. "Haji Hussain Ansari is minority welfare minister of Jharkhand". TwoCircles.net. 11 October 2010. Archived from the original on 14 July 2018.
  2. "Jharkhand Chief Minister Hemant Soren expands cabinet, inducts six ministers". NDTV. 4 August 2013. Archived from the original on 26 August 2019.
  3. The Hindu (3 October 2020). "Jharkhand Minister Haji Hussain Ansari passes away" (in Indian English). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  4. Gautam Mazumdar (3 October 2020). "Jharkhand minority welfare minister Haji Hussein Ansari dies battling Covid-19". The Hindustan Times. Archived from the original on 4 October 2020.
  5. Manob Chowdhury (3 October 2010). "Minister Haji Ansari dies of cardiac arrest, 2-day state mourning". The Telegraph. Archived from the original on 4 October 2020.