హారిక (పాయల్ ఘోష్)
హారిక (పాయల్ ఘోష్) దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త. ప్రయాణం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన హారిక... తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో నటించింది.[1]
హారిక | |
---|---|
జననం | పాయల్ ఘోష్ నవంబర్ 13, 1989 |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జననం - విద్యాభ్యాసం
మార్చుహారిక 1989, నవంబరు 13న కలకత్తాలో జన్మించింది. హాన్స్ గ్రాడ్యుయేట్-పొలిటికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లమో చేసింది.[2]
వృత్తిజీవితం
మార్చుపుట్టుకతో బెంగాలీ అయినా ప్రచార కార్యక్రమాల్లో నటించడం కోసం ముంబైకి వెళ్లి, యాక్టింగ్ స్కూల్ లో చేరింది.
నటించిన చిత్రాల జాబితా
మార్చుసంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2008 | షార్ప్ పెర్ల్ | పద్మే | ఆంగ్లం | టివీ సినిమా |
2009 | ప్రయాణం | హారిక | తెలుగు | |
2010 | వర్శదారే | మైథిలి | కన్నడ | |
2011 | ఊసరవెల్లి | చిత్ర | తెలుగు | |
2011 | మిస్టర్ రాస్కెల్ | సౌందర్య | తెలుగు | |
2014 | తెరోడమ్ వీడియైల్ | పావలకోడి | తమిళ | |
2014 | ఫ్రీడమ్ | హిందీ | ||
2016 | పటేల్ కీ పంజాబీ షాది | హిందీ |
రాజకీయ జీవితం
మార్చుపాయల్ ఘోష్ రాందాస్ అథవాలేకు చెందిన రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ)లో చేరి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తుంది.[3][4]
మూలాలు
మార్చు- ↑ సాక్షి. "అతడే నా ఫస్ట్ క్రష్." Retrieved 2 July 2017.
- ↑ టాలీవుడ్ ఫోటో పోఫ్రైల్స్. "పాయల్ ఘోష్ , Payal Ghosh,Harika)". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 2 July 2017.
- ↑ TV9 Telugu (26 October 2020). "రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన నటి పాయల్ ఘోష్". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (26 October 2020). "Actor Payal Ghosh joins Ramdas Athawale's party" (in Indian English). Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.