హార్ట్‌బీట్ 2017లో విడుదలైన తెలుగు సినిమా. దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్యామ్ దేవాభక్తుని నిర్మించిన ఈ సినిమాకు ద్వారక్ రాజా దర్శకత్వం వహించాడు.[1] తమిళంలో 2017లో విడుదలైన “కాదల్ కసకుతయా” సినిమాను “హార్ట్ బీట్” పేరుతో తెలుగులోకి అనువదించారు. ధృవ, వెన్బా, చార్లీ, కల్పన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 15న విడుదల చేసి, సినిమాను 19 జనవరి 2018న విడుదల చేశారు.[2]

హార్ట్‌బీట్
దర్శకత్వంద్వారక రాజా
రచనద్వారక రాజా
కథద్వారక రాజా
నిర్మాతశ్యామ్ దేవాభక్తుని
తారాగణంధృవ
వెన్బా
ఛాయాగ్రహణంబాలాజీ సుబ్రహ్మణ్యం
కూర్పుమునియెజ్
సంగీతంధరన్ కుమార్
నిర్మాణ
సంస్థ
దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2018 జనవరి 19 (2018-01-19)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

17 ఏళ్లు ఉన్న దివ్య ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. కానీ ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 25 ఏళ్ల అర్జున్‌ను ప్రేమించింది. ఇద్దరి మధ్య వయసు అంతరం ఉన్న పర్వాలేదు అనుకున్న దివ్య, తన ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, చివరికి దివ్య ప్రేమ గెలిచిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • ధృవ
  • వెన్బా
  • చార్లీ
  • కల్పన
  • దీప నేత్రన్
  • వైశాలి తణిగా
  • లింగా
  • జయగణేష్
  • శివమ్
  • నవీన్ జిజె

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: శ్యామ్ దేవాభక్తుని
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: ద్వారక్ రాజా
  • సంగీతం: ధరణ్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రమణ్యం

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "అద్దాల మేడలో"    4:42
2. "హలో అర్జున్"  హరిణి 4:14
3. "నీ కలలతోటలో"    4:42
4. "ఆనందమే"    1:20
5. "హార్ట్‌బీట్ థీమ్"   2:31
6. "లవ్ ఇస్ లైఫ్ థీమ్"   1:49

మూలాలు మార్చు

  1. Andhrabhoomi (2 January 2018). "'హార్ట్‌బీట్' సెన్సార్ పూర్తి". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
  2. Bookmyshow (2018). "Heartbeat (2018) - Movie Reviews, Cast & Release Date". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
  3. Filmy Focus (19 January 2018). "హార్ట్ బీట్". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.