హాలాహలం

క్షీరసాగర మథనం చేసినపుడు వెలికివచ్చిన విషం.
(హాలాహలము నుండి దారిమార్పు చెందింది)

హాలాహలం లేదా కాలకూటం[1] అనేది హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినపుడు వెలికివచ్చిన విషం. ఇది అమృతం ఉద్భవించక మునుపే పుట్టింది. దీనిని చూసి దేవతలు, రాక్షసులు భయకంపితులయినారు. దీనిని పరమ శివుడు స్వీకరించి తన కంఠంలో బంధించాడు. అందుకనే ఆయనకు నీలకంఠుడని పేరు పొందాడు.[2]

హాలాహలాన్ని సేవిస్తున్న శివుడు

క్షీరసాగర మథనం

మార్చు

దేవ రాక్షస సంగ్రామంలో దుర్వాసముని శాపం కారణంగా ఓడిపోయిన దేవతలు మహావిష్ణువును శరణు వేడుతారు. ఆయన అసురులతో సఖ్యంగా ఉంటూ ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సంపాదించమనీ, తర్వాత తన మాయతో అది దేవతలకే దక్కేలా తాను చూసుకుంటానని చెబుతాడు. అప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెడతారు. ఈ మథనంలో అనేక అపురూపమయిన వస్తువులు ఉద్భవించాయి. వాటితో పాటు అమృతం ఏర్పడక ముందే భయంకరమైన హాలాహలం కూడా ఉద్భవించింది. ఈ హాలాహలం నుంచి దేవ రాక్షసులనూ, ముల్లోకాలను కాపాడటానికి శివుడు దానిని మింగి తన కంఠంలోనే ఉంచుకున్నాడు. అందుకే ఆయనకు గరళకంఠుడు లేదా నీలకంఠుడు అని పేరు వచ్చింది.[3]

మూలాలు

మార్చు
  1. The Presence of Siva By Stella Kramrisch
  2. TQ Team C0118142. "The Orient: Shiva's Blue Throat". Library.thinkquest.org. Archived from the original on 2013-11-24. Retrieved 2013-05-13.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "శివుని నీలకంఠం -". Retrieved 2022-07-19.
"https://te.wikipedia.org/w/index.php?title=హాలాహలం&oldid=4076053" నుండి వెలికితీశారు