హిడ్నొకార్పిక్ ఆమ్లం

హిడ్నొకార్పిక్ ఆమ్లం (hydnocarpic acid) అనునది ఒక కొవ్వు ఆమ్లం. ఒక ద్వింబంధాన్ని కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. అయితే ఈ ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలం మిగతా అమ్లంలలో వున్నట్లుగా సరళంగా కాకుండగా చక్రీయత లేదా వృత్తస్థిత (cyclic) రూపాన్ని కల్గివున్నది. అందుచే దీనిని భిన్నమైన సౌష్టవమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం అంటారు. హిడ్నోకార్పస్ జాతికి చెందిన మొక్కల నుండి వచ్చిన నూనెలలో ఈ ఆమ్లాన్ని కనుగొనటం వలన హిడ్నొకార్పిక్ ఆమ్లం అన్న పేరు వచ్చింది.[1]

హిడ్నొకార్పిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
1-(2-cyclopenten-1-yl)undecanoic acid
ఇతర పేర్లు
Hydnocarpic Acid
11-(2-cyclopenten-1-yl)undecanoic acid
C16:1 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [459-67-6]
పబ్ కెమ్ 110680
SMILES O=C(O)CCCCCCCCCCC1\C=C/CC1
  • InChI=1/C16H30O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16(17)18/h7-8H,2-6,9-15H2,1H3,(H,17,18)/b8-7-

ధర్మములు
C16H28O2
మోలార్ ద్రవ్యరాశి 252.39
ద్రవీభవన స్థానం 59-60°C
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references
హిడ్నొకార్పిక్ ఆమ్లం


అమ్లనిర్మాణ సౌష్టవము-గుణగణాలు మార్చు

ఉనికి గుర్తింపు

హిడ్నోకార్పిక్ ఆమ్లాన్ని కలిగి వున్నచౌల్‌ముగ్రా నూనెను 1899 నాటికే కుష్టురోగ నివారణకై వాడుచున్నప్పటికి, ఈ ఆమ్లం గురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు. హోల్మాన్, డీన్ (Hollman &Dean లు ఈ ఆమ్లం యొక్క మిథైల్ ఎస్టరులను రోగనివారణలో ఉపయోగించి ఫలితాలు పొందారు. రీజరు ఆ ఆమ్లం యొక్క సోడియం లవణాలను వాడటం గురించి పత్రం విడుదల చేశాడు[2]

హిడ్నొకార్పిక్ ఆమ్లంలో మిగతా కొవ్వు ఆమ్లాలవలె హైడ్రోకార్బన్ శృంఖలం ఒక చివర కార్బోక్సిల్ (COOH) సమూహం సనుసంధానింపబడి వుండగా, రెండో అంచు చివర మైథైల్ (CH3) సమూహం నకు బదులుగా పంచభుజి pentagonal) హైడ్రోకార్బన్ అనుసంధానింపబడివుండును. ఆ పంచభుజిలోనే ఒక ద్విబంధం ఏర్పడివుండును. హిడ్నోకార్పిక్ ఆమ్లం యొక్క అణు సంకేత సూత్రం C15H27COOH. ఈ ఆమ్లం యొక్క శాస్త్రీయనామం 11- (సైక్లొపెంటైల్) అన్‌డెకనోయిక్ ఆసిడ్ [11- (2-cyclopenten-1-yl) undecanoic acid].

హిడ్నోకార్పిక్ ఆమ్లంలోని మూలకాల సమ్మేళన భార నిష్పత్తి కార్బన్=76.14%, హైడ్రోజన్:11.18%, ఆక్సిజన్:12.68%

గుణగణాల పట్టిక [3]

గుణము విలువల మితి
అణు సంకేత సూత్రం C16H28O2
అణు భారం 252.39
ద్రవీభవన ఉష్ణోగ్రత 59-60°C

లభ్యత మార్చు

ఉపయోగాలు మార్చు

  • కుష్టురోగ నివారణలో ఉపయోగిస్తారు[5]

ఇవికూడా చూడండి మార్చు

బయటిలింకులు మార్చు

మూలాలు/ఆధారాలు మార్చు

  1. Sengupta, A.; Gupta, J. K.; Dutta, J.; Ghosh, A. (1973). "The component fatty acids of chaulmoogra oil". Journal of the Science of Food and Agriculture. 24 (6): 669–74. doi:10.1002/jsfa.2740240606. PMID 4737104.
  2. "THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS". pubs.acs.org/. Retrieved 2013-12-01.
  3. "Hydnocarpic Acid". www.drugfuture.com/. Archived from the original on 2014-09-02. Retrieved 2013-12-01.
  4. "hydnocarpic acid". www.merriam-webster.com/. Retrieved 2013-12-01.
  5. "hyd'no•car'pic ac'id". dictionary.infoplease.com/. Archived from the original on 2015-09-12. Retrieved 2013-12-01.