హీరో 2021లో విడుదలైన తెలుగు సినిమా. రిషబ్ శెట్టి ఫిలింస్ బ్యానర్‌పై రిషబ్ శెట్టి నిర్మించిన ఈ సినిమాకు ఎం. భరత్ రాజ్ దర్శకత్వం వహించాడు. రిషబ్ శెట్టి, గానవి లక్ష్మణ్, ప్రమోద్‌శెట్టి, అనిరుధ్‌ మహేశ్‌, ప్రదీప్‌ శెట్టి, మంజునాథ్‌ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మార్చి 5న విడుదలైంది.

హీరో
దర్శకత్వంఎం.భరత్ రాజ్
రచనఎం.భరత్ రాజ్
అనిరుద్ మహేష్
నిర్మాతరిషబ్ శెట్టి
తారాగణంరిషబ్ శెట్టి
గానవి లక్ష్మణ్
ఛాయాగ్రహణంఅరవింద్. ఎస్. కశ్యప్
కూర్పుప్రతీక్ శెట్టి
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థ
రిషబ్ శెట్టి ఫిలిమ్స్
విడుదల తేదీ
మార్చి 5, 2021 (2021-03-05)
సినిమా నిడివి
125 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కాలేజీలో రిషభ్‌ శెట్టి, గానవి లక్ష్మణ్ ప్రేమించి, ప్రేమలో విఫలమై ఒక బార్బర్‌ షాపులో పనిచేస్తుంటాడు.గానవి లక్ష్మణ్ పై పగ పెంచుకుంటాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలనుకుంటాడు. ఆమె విలన్‌ (ప్రమోద్‌శెట్టి)ను వివాహం చేసుకుంటుంది. ఊరికి దూరంగా అడవిని తలపించే ఫామ్‌ హౌస్‌లో మందీ మార్బలంతో విలన్‌ నివసిస్తుంటాడు. అతని అనుమతి లేకుండా పురుగు కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో విలన్‌కు హెయిర్‌కట్‌ చేయడానికి హీరో వెళ్లాల్సి వస్తుంది. హీరోయిన్‌ను చంపి తన పగ కూడా తీర్చుకున్నట్లు ఉంటుందని అనుకుని ఆ బంగ్లాకు వెళ్తాడు. మరి హీరోయిన్‌ను హీరో చంపాడా ? విలన్‌ ఏం చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: రిషబ్ శెట్టి ఫిలింస్
  • నిర్మాత: రిషబ్ శెట్టి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం. భరత్ రాజ్
  • సంగీతం: బి.అజనీశ్‌ లోకనాథ్‌
  • సినిమాటోగ్రఫీ: అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌
  • ఎడిటింగ్‌: ప్రతీక్‌శెట్టి

మూలాలు

మార్చు
  1. NTV (24 July 2021). "రివ్యూ: హీరో (కన్నడ డబ్బింగ్)". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
  2. The Times of India (28 February 2021). "Ganavi Laxman on her journey to playing the lead in Rishab Shetty's Hero - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.