హెన్రీ జేన్స్ ఫోండా (1905 మే 16 - 1982 ఆగస్టు 12) అమెరికన్ నటుడు.[1] ఐదు దశాబ్దాల పాటు బ్రాడ్‌వేలోనూ, హాలీవుడ్‌లోనూ ఫోండా కెరీర్ కొనసాగింది. హాలీవుడ్ సినిమాల్లోని స్టాక్ పాత్ర అయిన పక్కింటబ్బాయి వంటి ఎవ్రీమేన్ పాత్రలో ప్రసిద్ధుడు. ఈ తరహా పాత్రలను క్లాసిక్‌లుగా పేరుతెచ్చుకున్న అనేక సినిమాల్లో వేశాడు.

హెన్రీ ఫోండా
వార్‌లాక్ (1959) సినిమాలో ఫోండా
జననం
హెన్రీ జేన్స్ ఫోండా

(1905-05-16)1905 మే 16
మరణం1982 ఆగస్టు 12(1982-08-12) (వయసు 77)
విద్యాసంస్థయూనివర్శిటీ ఆఫ్ మినెసోటా
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1928–1981
రాజకీయ పార్టీడెమోక్రాటిక్
జీవిత భాగస్వామి
  • మార్గరెట్ సల్లవన్
    (m. 1931; div. 1933)
  • ఫ్రాన్సెస్ సేమర్ బ్రాకా
    (m. 1936; died 1950)
  • సుసాన్ బ్లాన్‌కార్డ్
    (m. 1950; div. 1956)
  • ఆఫ్డెరా ఫ్రాన్చెట్టీ
    (m. 1957; div. 1961)
  • షిర్లీ మే ఆడమ్స్
    (m. 1965)
పిల్లలుజేన్ ఫోండా, పీటర్ ఫోండా సహా ముగ్గురు
బంధువులు
  • బ్రిడ్జెట్ ఫోండా (మనవరాలు)
  • ట్రాయ్ గెరిటీ (మనవడు)

నెబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఫోండా బ్రాడ్‌వే నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. 1935లో హాలీవుడ్ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించాడు. అతను జెజెబెల్ (1938), జెస్సీ జేమ్స్ (1939), యంగ్ మిస్టర్ లింకన్ (1939) వంటి చిత్రాలలో నటిస్తూ, ఆ క్రమంలో స్టార్‌డమ్ సాధించాడు. ది గ్రేప్స్ ఆఫ్ రాత్ (1940)లో టామ్ జోడ్ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డుకు నామినేషన్ లభించడంతో అతని కెరీర్ మరింత ముందుకువెళ్ళింది.

1941లో స్క్రూబాల్ కామెడీ[నోట్స్ 1] క్లాసిక్ ది లేడీ ఈవ్‌లో బార్బరా స్టాన్‌విక్ సరసన ఫోండా నటించాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌ఫోర్సులో చేరి సేవలందించడానికి ముందు ది ఆక్స్-బో ఇన్సిడెంట్ (1943) అన్న వెస్టర్న్ సినిమాలో నటించాడు. యుద్ధం ముగిసి సర్వీస్ పూర్తయ్యాకా జాన్ ఫోర్డ్ దర్శకత్వం వహించిన రెండు వెస్టర్న్ సినిమాలు మై డార్లింగ్ క్లెమెంటైన్ (1946), ఫోర్ట్ అపాచీ (1948)ల్లో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లో ఏడేళ్ళ పాటు విరామం తీసుకుని స్టేజీ నాటకాలపై దృష్టిపెట్టాడు. విరామం అనంతరం నటించిన సినిమా మిస్టర్ రాబర్ట్స్ (1955). రెండవ ప్రపంచ యుద్ధంలోని ఒక యుద్ధ నౌకలో జరిగే కామెడీ డ్రామా సినిమా. 1956లో 51 సంవత్సరాల వయసులో అతను ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన ది రాంగ్ మేన్ సినిమాలో 38 ఏళ్ళ వయసున్న పాత్ర పోషించాడు. 1957లో 12 యాంగ్రీ మెన్ సినిమాలో ఎనిమిదవ జ్యూరర్ పాత్ర పోషించాడు. ఈ జ్యూరర్ పాత్ర మిగిలిన 11 మందికన్నా భిన్నమైన ప్రవర్తనతో ఉంటుంది. ఈ సినిమాకు ఫోండా సహ నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాలో పాత్రకు గాను ఫోండా బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ వారి ఉత్తమ విదేశీ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. Obituary Variety, August 18, 1982.


ఉల్లేఖన లోపం: "నోట్స్" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="నోట్స్"/> ట్యాగు కనబడలేదు