హెన్రీ బెక్వరల్

హెన్రీ బెకెరల్ (డిసెంబరు 15, 1852 - ఆగస్టు 25, 1908) ఒక ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త. రేడియో ధార్మికతను ఆవిష్కరించినందుకు గాను ఈయనకు 1903 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.[3] అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రేడియో ధార్మికతను ఈయన పేరు మీదుగా బెకెరల్స్ లో కొలుస్తారు.

హెన్రీ బెక్వరల్
Portrait by Paul Nadar, సుమారు 1905
జననంఆంటోనీ హెన్రీ బెకెరెల్
(1852-12-15)1852 డిసెంబరు 15
పారిస్, రెండవ ఫ్రెంచ్ సామ్రాజ్యం (ప్రస్తుతం ఫ్రాన్స్)
మరణం1908 ఆగస్టు 25(1908-08-25) (వయసు 55)
Le Croisic, Pays de la Loire, French Third Republic
(now France)
రంగములుభౌతిక శాస్త్రం
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలుÉcole Polytechnique
École des Ponts et Chaussées
పరిశోధనా సలహాదారుడు(లు)చార్లెస్ ఫ్రీడెల్[1]
ప్రసిద్ధిరేడియో ధార్మికత ఆవిష్కరణ
ముఖ్యమైన పురస్కారాలు
  • రంఫోర్డ్ మెడల్ (1900)
  • భౌతికశాస్త్రంలో నోబెల్ (1903)
  • బర్నార్డ్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ టు సైన్స్ (1905)
  • రాయల్ సొసైటీ సభ్యత్వం (1908)[2]
సంతకం

జీవిత విశేషాలు

మార్చు

హెన్రీ బెకెరెల్ ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో ఉన్న ప్యారిస్ లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఈయన కుటుంబంలో నాలుగు తరాల వారు గుర్తింపు పొందిన భౌతిక శాస్త్రవేత్తలు. బెకెరల్ తాత, తండ్రి, కొడుకు కూడా భౌతిక శాస్త్రవేత్తలే. [4] ఈయన ప్యారిస్ లోని లీచీ లూయిస్-లె-గ్రాండ్ పాఠశాలలో చదివాడు. ఈకోల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివాడు.

1892 లో ఈయన ఫ్రాన్సులోని నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ లో భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు. ఆ పదవికి తన కుటుంబం నుంచే ఎంపికైన మూడో వ్యక్తి ఈయన. 1894 లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ హైవేస్ లో చీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. తర్వాత తన అసలైన పరిశోధనలు ప్రారంభించాడు. ఆయన డాక్టరేటు పరిశోధన కాంతి యొక్క ప్లేన్ పోలరైజేషన్ మీద జరిగింది. అందులో భాగంగా స్ఫటికాలలో కాంతి శోషణ, ఇంకా పాస్ఫారిసెన్స్ మీద ప్రయోగాలు చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Becquerel, Henri, 1852–1908". history.aip.org. Retrieved 17 April 2022.
  2. "Fellows of the Royal Society". London: Royal Society. Archived from the original on 16 March 2015.
  3. "The Discovery of Radioactivity". Berkeley Lab. Archived from the original on 15 June 2020. Retrieved 28 May 2012.
  4. Henri Becquerel. [S.l.]: Great Neck Publishing. 2006. ISBN 9781429816434. OCLC 1002022209.