హెర్ట్జ్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హెర్ట్జ్ (hertz చిహ్నం: Hz) అనేది సమయం నుండి ఉత్పన్నమయిన ఒక ప్రమాణం, ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతిలో పౌనఃపున్యమును కొలుస్తుంది. పౌనఃపున్యము అనగా ప్రమాణకాలంలో చేయు డోలనాలు లేదా కంపనాల సంఖ్య. 1 హెర్ట్జ్ యొక్క పౌనఃపున్యం అర్థం ఒక సెకనుకు ఒకసారి ఏర్పడిన కంపనం. మధ్య C (పియానో యొక్క మధ్యలో C) నోట్ 262 Hz అనగా, దీనర్థం ఇక్కడ ప్రతి సెకనుకు 262 సార్లు కంపిస్తుంది, పియానో కీ బోర్డులో మిడిల్ C నోట్ ను ప్లే చేసినప్పుడు వెలువడిన శ్రవణాన్ని మనం మిడిల్ C నోట్‌గా ఆలకిస్తాము.
మానవులు 20 Hz నుండి 20,000 Hz మధ్య ధ్వనులను వినగలుగుతారు. గుడ్లగూబ 200 Hz నుండి 12,000 Hz మధ్య ధ్వనులను వినగలుగుతుంది. ప్రాధమిక యూనిట్ 1/సెకను. ఈ హెర్ట్జ్ యూనిట్ పేరు హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్ శాస్త్రవేత్త పేరు మీద ఏర్పడింది.
బహుళ యూనిట్లు
మార్చు1000 హెర్ట్జ్ అనగా 1 కిలోహెర్జ్. 1000 కిలోహెర్జ్ అనగా 1 మెగాహెర్జ్, 1000 మెగాహెర్జ్ అనగా 1 గిగాహెర్ట్జ్: (ఈ క్రింది పట్టిక చూడండి)
Unit | Equal to: |
---|---|
Kilohertz (KHz) | 1000 Hz |
Megahertz (MHz) | 1000 KHz |
Gigahertz (GHz) | 1000 MHz |
Terahertz (THz) | 1000 GHz |
Petahertz (PHz) | 1000 THz |
Exahertz (EHz) | 1000 PHz |
Zettahertz (ZHz) | 1000 EHz |
Yottahertz (YHz) | 1000 ZHz |
ఉదాహరణలు
మార్చు- భూమి భ్రమణం (24 గంటలకు ఒకసారి) యొక్క పౌనఃపున్యం 12 మైక్రోహెర్ట్జ్ (1Hz కంటే చాలా తక్కువ)
- ఈ హెర్ట్జ్ ను కొన్నిసార్లు కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్‌లలో ప్రాసెసర్ యొక్క శక్తిని కొలవడానికి ఉపయోగిస్తారు.
- యునైటెద్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని అమెచ్యూర్ రేడియో 1.8 నుంచి 1300 MHz మధ్య వివిధ పౌనఃపున్యాలను కలిగిస్తుంది.
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 3, 25 MHz మధ్య పౌనఃపున్యాలను అలాగే 108, 136 MHz మధ్య పౌనఃపున్యాలను ఉపయోగిస్తుంది.