హెలిక్యామ్
(హెలికాం నుండి దారిమార్పు చెందింది)
రిమోట్ ద్వారా నియంత్రించే కెమెరా కలిగిన చిన్న హెలికాప్టర్ హెలిక్యామ్. విహంగ చిత్రాలు లేదా చలన చిత్రాలను తీసేందుకు ఈ హెలిక్యాం ఉపయోగపడుతుంది[1]. ఈ హెలిక్యామ్ కెమెరా నిర్వాహకునితో నియంత్రించబడుతూ పైన ఎగురుతూ ఫోటోలను, వీడియోలను తీస్తుంది. ఈ హెలిక్యామ్ వ్యవస్థ ఇద్దరు ఆపరేటర్ల నియంత్రణలో నియంత్రించబడుతుంది, ఒకరు హెలిక్యాం పైలట్‌గా, మరొకరు కెమెరామెన్‌గా నియంత్రిస్తారు. హెలికాం లక్షణాల్లో ఒకటి సౌలభ్యంగా చిన్న పరిమాణాన్ని కలిగి ఉండటం. 4 చదరపు మీటర్ల అనుకూలమైన స్థలం ఉన్న అన్నిచోట్ల టేకాఫ్, లాండ్ అయ్యేట్లుగా ఉంటుంది. ఈ హెలిక్యామ్‌లు 15 నుండి 30 నిమిషాలు పాటు ఏకధాటిగా ఎగరగలవు, చార్జింగ్ తగ్గినపుడు కిందికి దింపి కొన్ని సెకన్లలోనే ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీలను అమర్చుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ Ganapati, Priya (2010-04-29). "Helicam Combines Toy Helicopter and Camera for HD Videos". Wired. ISSN 1059-1028. Retrieved 2020-09-17.