హేమచంద్రుడు

(హేమచంద్రుఁడు నుండి దారిమార్పు చెందింది)

హేమచంద్రుడు సంస్కృత పండితుఁడు. ఇతఁడు శాలివాహన శక 1100 సంవత్సరములప్పుడు ఉండినట్లు తెలియవచ్చుచున్నది. హేమచంద్రకోశము అను ఒక నిఘంటువు ఇతఁడు రచించెను.

హేమచంద్రుడు (12వ శతాబ్దం) తన త్రిషష్ఠిలాకపురుష చరిత్రమున ఏడవ పర్వములో రామకథను మరల రచించెను. దీనినే హేమచంద్రుని రామచరితమనియు, జైన రామాయణమనియు పిలుస్తారు. అది రాక్షస వానరుల వృత్తాంతముతో ప్రారంభమగును. నాల్గవ సర్గము మొదలు అదవ సర్గ చివరి వరకు సీతారామలక్ష్మణుల కథ వర్ణించబడినది. ఈ గ్రంథము ననుసరించెయే 16అ శాతాబ్దమున రాజవిజయసూరి శిష్యుడయిన దేవ విజయ గణిచే రమచరితమను గద్య కావ్యము రచించబడినది.[1]

జైన పండితుఁడయి సోమదేవుఁ డనఁబడెడి యీ సోమచంద్రుఁడు 1205-వ సంవత్సరమునందు 'శబ్దార్ణవ చంద్రిక' యను సంస్కృతవ్యాకరణమును రచియించెను. సోమచంద్రుఁ డన్న పాఠమునకంటెఁ ద్రిలింగశబ్దానుశాసనములో ననేక స్థలములయందున్న హేమచంద్రుఁ డన్న పాఠమే సరియైనది. త్రిలింగశబ్దానుశాసనమునందు "హేమచంద్రుఁడు మునిఁగా జెప్పఁబడినాఁడు.[2]

మూలాలు

మార్చు
  1. రామాయణము - జైన బౌద్ధ గ్రంథములు. కిళాంబి రాఘవారార్యులు గారు
  2. "ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/అధర్వణాచార్యుఁడు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-04-20.