హేమచంద్ర వ్యాకరణము

పాణిని రచించిన గ్రంథము అష్టాధ్యాయి. శబ్ద శాస్త్రమును సూత్ర రూపమున బోధించి కృతకృత్యుడయిన వారిలో ఈతడే ఉత్తమోత్తముడు. వ్రాసినవి నాలుగువేల సూత్రములు. వానికి అనుకూలపడుటకు, అధికారము లనియు అనువృత్తు లనియు మరికొన్నిటిని స్వీకరించెను. అష్టాధ్యాయికి పిదప వైయూకరణులు అనేకులు పాణినీయ తంత్రమునకు వ్యాఖ్యానములు కావించిరి. అష్టాధ్యాయిలో ఉన్నవి ఉన్నట్టు సూత్రములనుంచి ఆక్రముమమున వ్యాఖ్యానములోనర్చినవారు కొందరు. విషయమంతకు ఒకవిధముగ ప్రణాళిక ఏర్పరచుకొని తదనుకూలముగ శీర్షికలను గవించి చక్కగా బోధించువారు కొందరు. ఇటువంటి వ్యాకరణము లలో ఒకటి ఈ హేమచంద్ర వ్యాకరణము[1]. దీనిని రచించిన హేమచంద్రుడు జైనుడు. 11వ శతాబ్దిలో ఈతడు ముంబాయి సమీపమునందు జన్మించాడు. జైన మతమందు ఆచార్యుడైనాడు. ఈ గ్రంథమునందు 8 అధ్యాయములు, 4 పాదములు ఉన్నాయి.వీటిలో 7 అధ్యాయములు సంస్కృత భాషకును, 8 వది ప్రాకృత భాకు సంబంధించింది.హేమచంద్రుడు దీనినే కాక ద్వాశ్రయ కావ్యమొకటి భట్టి కావ్యము రీతి లక్ష్య గ్రంథముగా రచించాడు.

మూలాలు మార్చు

  1. प्राकृत व्याकरण: Prakrit Grammar of Shri Hemachandra (An Old and Rare Book).

1. భారతి మాస సంచిక.