హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర ఈ రింగు రోడ్డును నిర్మించనున్నారు. సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-యాదాద్రి-చౌటుప్పల్‌ వరకు 158 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం, చౌటుప్పల్‌-చేవెళ్ల-శంకర్‌పల్లి-ఆమనగల్‌-సంగారెడ్డి వరకు దక్షిణ భాగంగా 182 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతించింది.[1][2]

రీజినల్ రింగు రోడ్డు
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాదు మహానగరపాలక సంస్థ,
హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం,
హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
పొడవు210 మై. (340 కి.మీ.)
Statusప్రతిపాదించిన (2018)
Existed2018 (ప్రతిపాదించిన)–present
ముఖ్యమైన కూడళ్ళు
రింగు రోడ్డు around హైదరాబాదు
దక్షిణం చివరకంది
ఉత్తర చివరసంగారెడ్డి
ప్రదేశము
దేశంభారతదేశం
రహదారి వ్యవస్థ

హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి మొత్తం 17 వేల కోట్ల రూపాయలు. చౌటుప్పల్ (జాతీయ రహదారి 65) , షాద్ నగర్ (జాతీయ రహదారి 44), సంగారెడ్డి (జాతీయ రహదారి 65) వరకు దక్షిణ భాగ రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి 6 వేల 481 కోట్లు (ఉత్తర భాగానికి పదివేల కోట్లకు పైగా + దక్షిణ భాగానికి 6,481 కోట్లు కలిపి) ఖర్చు అవుతాయని ప్రాథమిక అంఛనా. దాదాపు 17 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్.ఆర్.ఆర్. ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది.[3]

క్లవర్‌లీఫ్‌ ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్టర్లు రానున్న ప్రాంతాలు

మార్చు
  1. హైదరాబాద్‌–ముంబై జాతీయ రహదారి: పెద్దాపూర్‌–గిర్మాపూర్‌ గ్రామాల మధ్య
  2. సంగారెడ్డి–నాందేడ్‌ రహదారి: శివంపేట సమీపంలోని ఫసల్‌వాది సమీపంలో..
  3. హైదరాబాద్‌–మెదక్‌ రోడ్డు: రెడ్డిపల్లి–పెద్ద చింతకుంట మధ్య
  4. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ రోడ్డు: తూప్రాన్‌ సమీపంలోని మాసాయిపేట వద్ద
  5. హైదరాబాద్‌–కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి: గౌరారం సమీపంలోని గుందాన్‌పల్లి వద్ద
  6. హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి: భువనగిరి–రాయ్‌గిరి మధ్య భువనగిరికి చేరువలో..
  7. జగదేవ్‌పూర్‌–చౌటుప్పల్‌ రోడ్డు: మందాపురం–పెనుమటివానిపురం మధ్య..
  8. హైదరాబాద్‌–విజయవాడ హైవే: చౌటుప్పల్‌ సమీపంలోని బాగరిగడ్డ వద్ద

మూలాలు

మార్చు
  1. NTV (12 December 2021). "రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు". Archived from the original on 27 January 2022. Retrieved 27 January 2022.
  2. Sakshi (23 February 2021). "ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం ఓకే!". Archived from the original on 12 April 2021. Retrieved 27 January 2022.
  3. Namasthe Telangana (25 March 2022). "ఆర్‌ఆర్‌ఆర్‌పై తొలి గెజిట్‌ రెడీ!". Archived from the original on 25 March 2022. Retrieved 25 March 2022.