హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (ఆగ్లం: Hyderabad Literary Festival) అనేది భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ప్రతీయేటా నిర్వహించే సాహిత్య మహోత్సవం. ఇది అన్ని రూపాల్లో సృజనాత్మకతను జరుపుకునే మూడు రోజుల వార్షిక కార్యక్రమం. ప్రతిసారి ఒక అతిథి దేశం, ఒక భారతీయ భాషకు పెద్దపీట వేస్తారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ | |
---|---|
ప్రక్రియ | సాహిత్య ఉత్సవం |
తేదీలు | 27–29 జనవరి 2023 |
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
దాతలు | కార్వీ గ్రూప్, తెలంగాణ టూరిజం | హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ |
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ దేశంలోని సాంస్కృతిక క్యాలెండర్‌లో ఒక ముఖ్యమైన సంఘటనగా ఉద్భవించింది. ఈ ఉత్సవాలలో రచయితలతో సంభాషణలు, వర్క్‌షాప్‌లు, పుస్తక ఆవిష్కరణలు, వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ నిర్వహించే హైదరాబాదు సాహిత్య ఉత్సవానికి తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖతో కలిసి అనేక విద్యా, సాహిత్య, సాంస్కృతిక సంస్థలు, ప్రచురణ సంస్థలు సహాయ సహకారాలు అందిస్తాయి.
2023 జనవరి 27 నుంచి మూడు రోజుల పాటు సైఫాబాద్‌లోని విద్యారణ్య హైస్కూల్ ప్రాంగణంలో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది. ఇందులో సాహిత్య చర్చాగోష్ఠులు, చిత్రలేఖనం, కథోత్సవం, కవితాగానం, ఛాయాచిత్రాల ప్రదర్శనలు, నృత్య, నాటిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి జర్మనీ అతిథి దేశంగా, కొంకణి భాషలో ఒకటిగా నిర్వహించబడడం విశేషం.[1]
మూలాలు
మార్చు- ↑ "సాహిత్య శోభ | Sahitya Sobha". web.archive.org. 2023-01-29. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)