హైపోగ్లైసీమియా
రక్తంలో చక్కెర స్తా యి తక్కువ గా ఉండే శరీర పరిస్థితిని హైపోగ్లైసీమియా, అంటారు. దీంట్లో చక్కెర స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువగా పడిపోవడం జరుగుతుంది. దీనివలన మొద్దుతనము , మాట్లాడటంలో ఇబ్బంది, గందరగోళంలో పడడం, స్పృహ కోల్పోవడం, మూర్ఛలు లేదా మరణంతో సహా వివిధ రకాల లక్షణాలకు దారితీయవచ్చు. ఆకలి, చెమట, వణుకు, బలహీనత కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా త్వరగా కనపడుతాయి.[1]
హైపోగ్లైసీమియా | |
---|---|
ఇతర పేర్లు | రక్తంలో తక్కువ చక్కర |
గ్లూకో మీటర్ | |
ప్రత్యేకత | ఎండోక్రైనాలజీ |
లక్షణాలు | మొద్దుతనము , మాట్లాడటంలో ఇబ్బంది, గందరగోళంలో పడడం, స్పృహ కోల్పోవడం, మూర్ఛలు లేదా మరణం |
సాధారణ ప్రారంభం | త్వరగా |
కారణాలు | మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్)చికిత్స లో ఉపయోగించే మందులు - ఇన్సులిన్, సల్ఫోనిల్యూరియాస్, మూత్రపిండాల వైఫల్యం, కొన్ని కణితులు, కాలేయ వ్యాధి, హైపోథైరాయిడిజం, ఆహారం తీసుకోవకపోవడం, జీవక్రియలో పుట్టుకతో వచ్చే లోపం, తీవ్రమైన అంటువ్యాధులు, రియాక్టివ్ హైపోగ్లైసీమియా, ఇంకా ఆల్కహాల్ వంటివి |
రోగనిర్ధారణ పద్ధతి | 3.9 mmol/L (70 mg/dL) కంటే తక్కువ |
చికిత్స | చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం లేదా డెక్స్ట్రోస్ తీసుకోవడం |
కారణాలు
మార్చుఅత్యంత సాధారణ కారణం మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్)చికిత్స లో ఉపయోగించే మందులు - ఇన్సులిన్, సల్ఫోనిల్యూరియాస్ వంటివి.[2] [3] మధుమేహ వ్యాధిగ్రస్తులలో సాధారణం కంటే తక్కువగా ఆహారము తీసుకున్నా, ఎక్కువ వ్యాయామం చేసినా లేదా మద్యం సేవించినా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.[1] ఇతర కారణాలలో మూత్రపిండాల వైఫల్యం, కొన్ని కణితులు (ఇన్సులిన్, కాలేయ వ్యాధి, హైపోథైరాయిడిజం, ఆహారం తీసుకోవకపోవడం, జీవక్రియలలో పుట్టుకతో వచ్చే లోపం, తీవ్రమైన అంటువ్యాధులు, రియాక్టివ్ హైపోగ్లైసీమియా, ఇంకా ఆల్కహాల్ తో సహా అనేక మందులు ఉన్నాయి.[1][3] ఆరోగ్యకరమైన శిశువులలో కూడా కొన్ని గంటలు ఆహారము తినని పరిస్థితిలో రక్తంలో చక్కెర తక్కువయి, ఈ సమస్య ఏర్పడవచ్చు.[4]
రోగ నిర్ధారణ
మార్చుహైపోగ్లైసీమియాను నిర్వచించే గ్లూకోజ్ స్థాయి మారుతూ ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో ఇది 3.9 mmol/L (70 mg/dL) కంటే తక్కువ స్థాయి ఉంటుంది. [1] మధుమేహం లేని వారిలో (పెద్దవాళ్లు) కూడా రక్తంలో చక్కెర తగ్గడం, ఈ లక్షణాలు మళ్ళీ ఎప్పుడు సాధారణ స్థితికి తిరిగి వచ్చి మెరుగుదల జరుగుతుంది అనే విషయం రోగ నిర్ధారణను చేస్తుంది.[5] తినకుండా లేదా వ్యాయామం తరువాత 2-3 mmol/L (50-55 mg/dL) కంటే తక్కువ స్థాయిఉంటే హైపోగ్లైసీమియాను నిర్ధారణ చేస్తారు.[1][6] నవజాత శిశువులలో, 2.2 mmol/L (40 mg/dL) కంటే తక్కువ స్థాయి చక్కర లక్షణాలు ఉంటే, హైపోగ్లైసీమియాను సూచిస్తుంది.[4] రక్తంలో ఇన్సులిన్, సి-పెప్టైడ్ స్థాయిలు వంటి ఇతర పరీక్షలు కూడా కారణాన్ని నిర్ణయించడంలో ఉపయోగపడతాయి.[3]
నివారణ
మార్చుమధుమేహం ఉన్నవారిలో, వ్యాయామం, తీసుకునే మందుల మొత్తం తో తినే ఆహారాన్ని సరిపోల్చడం ద్వారా ఈ హైపోగ్లైసీమియా పరిస్థితి నివారణ జరుగుతుంది. ప్రజలు తమ రక్తంలో చక్కెర తక్కువగా ఉందని భావించినప్పుడు, గ్లూకోజ్ మానిటర్ పరికరంతో పరీక్షించుకోవాలి. కొంతమందిలో కొన్ని ప్రారంభ లక్షణాలు ఉంటాయి, వీరికి తరచుగా పరీక్షలు చేయవలసి ఉంటుంది. వీరికి చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం లేదా డెక్స్ట్రోస్ తీసుకోవడం వంటి చికిత్స చేస్తారు.[1] ఒక వ్యక్తి నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోలేనప్పుడు, ఇంజెక్షన్ ద్వారా లేక ముక్కు ద్వారా గ్లూకాగాన్ ఇస్తారు .[7] ఈ పరిస్థితికి మధుమేహానికి సంబంధం లేనప్పుడు అంతర్లీన సమస్యకు చికిత్స గురించి పరిశీలిస్తారు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం సూచిస్తారు.[1] కొన్నిసార్లు ఇవే లక్షణాలుతో ఉన్న ఇడియోపతిక్ పోస్ట్ప్రాండియల్ సిండ్రోమ్ ను కుడా "హైపోగ్లైసీమియా" అని తప్పుగా సూచిస్తారు. ఇది వివాదాస్పద పరిస్థితి, ఎందుకంటే దీనికి రక్తంలో చక్కెర స్థాయిలతో సంభంధం ఉండదు కానీ ఆహారము తీసుకోవడం బట్టి ఉంటుంది.[8][9]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Hypoglycemia". National Institute of Diabetes and Digestive and Kidney Diseases. October 2008. Archived from the original on 1 July 2015. Retrieved 28 June 2015.
- ↑ Yanai H, Adachi H, Katsuyama H, Moriyama S, Hamasaki H, Sako A (February 2015). "Causative anti-diabetic drugs and the underlying clinical factors for hypoglycemia in patients with diabetes". World Journal of Diabetes. 6 (1): 30–6. doi:10.4239/wjd.v6.i1.30. PMC 4317315. PMID 25685276.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link) - ↑ 3.0 3.1 3.2 Schrier, Robert W. (2007). The internal medicine casebook real patients, real answers (3rd ed.). Philadelphia: Lippincott Williams & Wilkins. p. 119. ISBN 978-0-7817-6529-9. Archived from the original on 1 July 2015. Retrieved 18 August 2019.
- ↑ 4.0 4.1 Perkin, Ronald M. (2008). Pediatric hospital medicine : textbook of inpatient management (2nd ed.). Philadelphia: Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins. p. 105. ISBN 978-0-7817-7032-3. Archived from the original on 1 July 2015. Retrieved 18 August 2019.
- ↑ Cryer PE, Axelrod L, Grossman AB, Heller SR, Montori VM, Seaquist ER, Service FJ (March 2009). "Evaluation and management of adult hypoglycemic disorders: an Endocrine Society Clinical Practice Guideline". J. Clin. Endocrinol. Metab. 94 (3): 709–28. doi:10.1210/jc.2008-1410. PMID 19088155.
- ↑ Ahmed, Fahad W.; Majeed, Muhammad S.; Kirresh, Omar (2023). "Non-Diabetic Hypoglycemia". StatPearls. StatPearls Publishing. Archived from the original on 7 March 2023. Retrieved 12 November 2023.
- ↑ "FDA approves first treatment for severe hypoglycemia that can be administered without an injection". FDA (in ఇంగ్లీష్). 11 September 2019. Archived from the original on 17 May 2020. Retrieved 11 November 2019.
- ↑ Talreja, Roshan S. (2005). The internal medicine peripheral brain. Philadelphia, Pa.: Lippincott Williams & Wilkins. p. 176. ISBN 978-0-7817-2806-5. Archived from the original on 3 August 2020. Retrieved 18 August 2019.
- ↑ Dorland's illustrated medical dictionary (32nd ed.). Philadelphia: Elsevier/Saunders. 2012. p. 1834. ISBN 978-1-4557-0985-4. Archived from the original on 3 August 2020. Retrieved 18 August 2019.