హోయాంగ్ హో

పసుపు నది లేదా ఎల్లో రివర్ దీనిని చైనాలో వేలాడే నది అని పిలుస్తారు.

పసుపు నది లేదా ఎల్లో రివర్ దీనిని చైనాలో వేలాడే నది అని పిలుస్తారు. ఇది చైనాలో రెండవ పొడవైన నది, ప్రపంచంలోని ఆరవ పొడవైన నది. చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లోని బయాన్ హర్ పర్వతాల శిఖరాల మధ్య ఉద్భవించింది, ఇది క్విన్‌హై-టిబెట్ పీఠభూమి, సిచువాన్ , గన్సు, నింగ్‌క్సియా, అంతర్గత మంగోలియా, షాంగ్సీ, హెనాన్, షాన్‌డాంగ్‌తో సహా తొమ్మిది ప్రావిన్సుల గుండా ప్రవహించి చివరకు కెన్లీ బోహై సముద్రంలో కలుస్తుంది. పసుపు నది పరీవాహక ప్రాంతం తూర్పు-పశ్చిమంగా 1900 కిమీ (1,180 మైళ్ళు), ఉత్తరం-దక్షిణంగా 1100 కిమీ (684 మైళ్ళు) విస్తరించి ఉంది. దాని బేసిన్ మొత్తం వైశాల్యం 742,443 చ.కి.మీ (290,520 చదరపు మైళ్ళు). [1]టిబెట్ లో దీన్నీ పీకాక్ రివర్, మంగోలియాలో షార్ మోరోన్ అని ఈ నదిని పిలుస్తారు. పసుపు నది, అయోలియన్ ఒండ్రు ఎత్తైన ప్రదేశంలో ప్రవహించడం వలన గాలిలోని అవక్షేపాలు ఈ పసుపు రంగుకు కారణమవుతాయి. ప్రవాహంలోని నీరు పసుపు రంగులో ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. చైనీస్ నాగరికత పసుపు నది బేసిన్లో ఉద్భవించిందని నమ్ముతారు. దీనిని చైనీయులు 'మదర్ రివర్', 'చైనీస్ నాగరికత యొక్క ఊయల' అని కూడా పిలుస్తారు.

హోయాంగ్ హో
పసుపు నది
పసుపు నది బేసిన్
స్థానం
Countryచైనా
చైనా ప్రావిన్స్కింగ్హై, సిచువాన్, గాన్సు, నింగ్సియా, ఇన్నర్ మంగోలియా, షాంక్సీ, షాన్క్సీ,హెనాన్, షాన్సాంగ్
భౌతిక లక్షణాలు
మూలంబయాన్ హర్ పర్వతాలు
 • స్థానంయుషు ప్రిఫెక్చర్, కింగ్హై
 • అక్షాంశరేఖాంశాలు34°29′31″N 96°20′25″E / 34.49194°N 96.34028°E / 34.49194; 96.34028
 • ఎత్తు4,800 మీ. (15,700 అ.)
సముద్రాన్ని చేరే ప్రదేశంబోహై సముద్రం
 • స్థానం
కెన్లీ డిస్ట్రిక్ట్, డాంగియింగ్, షాన్‌డాంగ్
 • అక్షాంశరేఖాంశాలు
37°45′47″N 119°09′43″E / 37.763°N 119.162°E / 37.763; 119.162
 • ఎత్తు
0 మీ. (0 అ.)
పొడవు5,464 కి.మీ. (3,395 మై.)
పరీవాహక ప్రాంతం752,546 కి.మీ2 (290,560 చ. మై.)
ప్రవాహం 
 • సగటు2,571 m3/s (90,800 cu ft/s)
 • కనిష్టం1,030 m3/s (36,000 cu ft/s)
 • గరిష్టం58,000 m3/s (2,000,000 cu ft/s)
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమఫెన్ నది
 • కుడిటావో నది, వీ నది (అనేక చిన్న నదులు)
పసుపు నది

చైనా విషాదం

మార్చు

పసుపు నది ప్రపంచంలోనే అత్యధిక అవక్షేప సాంద్రత కలిగిన నది 1977లో నమోదైన అత్యధిక అవక్షేప సాంద్రత 920 కేజీ/మీ3. సాన్‌మెన్క్సియా స్టేషన్‌లో సగటు వార్షిక అవక్షేపం 1.6 బిలియన్ టన్నులు, సగటు అవక్షేప సాంద్రత 35 కిలోలు/మీ3. పసుపు నదిలో పెద్ద మొత్తంలో అవక్షేపం కారణంగా, నది దిగువ భాగంలో అవక్షేపాలు ఏర్పడి నది నీటి మట్టం పెరిగి వరదలు సంభవిస్తాయి. నీటి నష్టం జరగకుండా ఉండేందుకు ఒడ్డుకు ఇరువైపులా కట్టలను కడతారు. అపుడు నదిలో నీటి మట్టం పెరుగుతూనే ఉంటుంది. భూమి కంటే నది ఎత్తులో ఉండడం వలన దీనిని వేలాడే నది అని అంటారు. ఈ నదికి తరచుగా వరదలు రావడం, వాటి వలన ప్రిఫెక్చర్లు, కౌంటీలు, గ్రామాలు, పట్టణాలు కొట్టుకపోవడం, భారీ ప్రాణనష్టం ఏర్పడడం వలన దీనికి 'చైనా విషాదం' అనే పేరు వచ్చింది.[2]

భౌగోళికం

మార్చు

ఈ నది ఎగువ భాగం, మధ్య భాగం, దిగువ భాగం అని మూడు భాగాలుగా విభజించబడింది.

బయాన్ హర్ పర్వతాలలో పసుపు నది ఉద్భవించే ప్రాంతం నుండి ఇన్నర్ మంగోలియాలోని హెకౌ ప్రాంతంలో ఉత్తరాన తిరిగే ప్రాంతం వరకు నది ఎగువ ప్రాంతాలుగా పేర్కొనబడింది. దీని మొత్తం పొడవు 3,472 కిమీ (2,160 మైళ్ళు), పరీవాహక ప్రాంతం 386,000 కిమీ (149,035 చదరపు మైళ్ళు). ఇది నది మొత్తం పరీవాహక ప్రాంతంలో 51.3%.[3]

ఇక్కడ ఇది బయాన్ హర్, అమ్నే మచిన్ పర్వత శ్రేణుల గుండా వెళుతుంది, అనేక పచ్చని పచ్చికభూములు, లోయలను దాటుతుంది. ఇక్కడ దాని నీరు ఎటువంటి కణాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. నదిలోని నీరు తేటగా ఉంటుంది. 4.7 మిలియన్ క్యూబిక్ మీటర్లతో లేక్ బాబ్, 10.8 మిలియన్ క్యూబిక్ మీటర్లతో లేక్ ఎలింగ్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. అవి ఎత్తైన ప్రదేశంలో ఉన్న రెండు పెద్ద మంచినీటి సరస్సులు.

లోయ ప్రాంతం కింగ్‌హైలోని లాంగ్‌యాంగ్ లోయ నుండి గన్సులోని క్వింగ్‌టాంగ్ వ్యాలీ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ నిలువు రాళ్లు నదికి ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నది లోతు తక్కువగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఇక్కడ నది ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో 20 లోయలు ఉన్నాయి. వాటిలో లాంగ్‌యాంగ్, జిషి, లియుజియా, బాపన్, కింగ్‌టాంగ్ ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతం అనేక లోతైన లోయలను కలిగి ఉంది, ఇది జలవిద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాంతం.

ప్రధాన ఉపనదులు, సరస్సులు

మార్చు

పసుపు నది ప్రధాన ఉపనదులు:

బైహె నది, హీహే నది, తావో నది, హువాంగ్‌షుయ్ (డాటోంగ్ నది), జువాంగ్‌లాంగ్ నది, జులి నది, క్వింగ్‌షుయ్ నది, దహే నది, కుయే నది, వుడింగ్ నది, ఫెన్ నది, వీ నది, లువో నది, క్విన్ నది, డావెన్ నది మొదలైనవి. వీహే నది పసుపు నదికి అతిపెద్ద ఉపనది.

పసుపు నది బేసిన్‌లోని ప్రధాన సరస్సులు:

ఎలింగ్ సరస్సు, జాలింగ్ సరస్సు, గంగ్నా గెమా కో, అయోంగ్ గోంగ్మా కో, వులియాంగ్ సుహై, షాహు, హాంగ్‌జియానావో, యున్‌చెంగ్ సాల్ట్ లేక్, డాంగ్‌పింగ్ సరస్సు మొదలైనవి.

కాలుష్యం

మార్చు

2007 డేటాబేస్ ప్రకారం పసుపు నది, దాని ఉపనదులలో ఉన్న నీరులో మూడింట ఒక వంతు వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు పనికిరాదని అంచనా వేసింది. ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలు, నగరాల నుండి వచ్చే వ్యర్థాలు దీనికి కారణం.[4][5]

నేలకోత

మార్చు

3000 - 2000 బిసి మధ్య కాలంలో పసుపు నది బేసిన్ (యాంగ్‌షావో సంస్కృతి కాలం నుండి అన్యాంగ్‌లోని యిన్ శిధిలాల వరకు) లోని భౌగోళిక వాతావరణం వృక్షసంపద పెరుగుదలకు, మానవ ఉత్పత్తి, జీవన కార్యకలాపాల అభివృద్ధికి అనుకూలమైనది. ఈ కాలంలో, పసుపు నది మధ్య, దిగువ ప్రాంతాలలో లీక్సియాజ్, ఒనోజావా వంటి పెద్ద సంఖ్యలో సరస్సులు ఉన్నాయి. వారింగ్ స్టేట్స్ కాలం తర్వాత, ఇనుప వ్యవసాయ పనిముట్లను విస్తృతంగా ఉపయోగించడం క్విన్ స్టేట్ ఆర్థిక కేంద్రం గ్వాన్‌జోంగ్‌కు వలస రావడంతో, పసుపు నది బేసిన్, లోయెస్ పీఠభూమిలోని వృక్షసంపద నాశనం కావడం ప్రారంభమైంది. 1430లలో ప్రపంచ వాతావరణ శీతలీకరణ ప్రారంభమయి చైనా ఆర్థిక కేంద్రం దక్షిణం వైపు వలస రావడంతో, పసుపు నది బేసిన్‌లో పర్యావరణ నష్టం జరిగింది. వృక్షసంపద నాశనంతో, లోయెస్ పీఠభూమి పసుపు నది ద్వారా క్షీణించడం ప్రారంభమైంది, పెద్ద మొత్తంలో మట్టి కొట్టుకుపోయి, వేలాది లోయల ఏర్పడ్డాయి.

రక్షణ

మార్చు

"14వ పంచవర్ష ప్రణాళిక" కాలంలో, కీలకమైన అప్‌స్ట్రీమ్ పర్యావరణ వ్యవస్థల రక్షణ, పునరుద్ధరణను పెంచడానికి, మూడు నదుల మూలం వద్ద "చైనీస్ వాటర్ టవర్"ను నిర్మించడానికి, గన్నన్ నీటి సంరక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రణాళిక చేయబడింది

మూలాలు

మార్చు
  1. "Yellow River | Location, Map, & Facts | Britannica". www.britannica.com. Retrieved 2023-05-27.
  2. "The Yellow River has been known as 'China's sorrow'. Now we know who was responsible". www.downtoearth.org.in. Retrieved 2023-05-27.
  3. "Yellow River: Facts, Location, Geography, Scenery". www.chinahighlights.com. Retrieved 2023-05-27.
  4. Branigan, Tania (2008-11-25). "One-third of China's Yellow river 'unfit for drinking or agriculture'". The Guardian. Retrieved 2023-05-27.
  5. Hays, Jeffrey. "YELLOW RIVER | Facts and Details". factsanddetails.com. Retrieved 2023-05-27.