హ‌వానా సిండ్రోమ్

(హ‌వానా సిండ్రోమ్‌ నుండి దారిమార్పు చెందింది)

హ‌వానా సిండ్రోమ్‌ అనేది మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన పదం, క్యూబాలోని యునైటెడ్ స్టేట్స్, కెనడియన్ రాయబార కార్యాలయం సిబ్బంది అనుభవించే వైద్య పరిశోధనలు ఇంకా లక్షణాల శ్రేణిని హ‌వానా సిండ్రోమ్‌ అని వ్యవహరిస్తున్నారు . తొలిసారి 2016లో దీనిని క్యూబాలో హవానా నగరంలోని అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో ఈ సమస్యను గుర్తించారు. తొలిసారి హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు[1].ప్రాణాంతకం కాని ఈ లక్షణాల యొక్క స్పష్టమైన కారణం కనుగొనబడలేదు [2].ఇది ఒక రకమైన - మైక్రోవేవ్ ఆయుధంతో శత్రు గూఢచార సేవ యొక్క రహస్య ఆపరేషన్ అని యుఎస్ ప్రభుత్వం అనుమానిస్తుంది.మైక్రోవేవ్ రేడియేషన్‌కు దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడం వల్ల "హవానా సిండ్రోమ్" సంభవించిందా, లేదా ఒత్తిడి వలన ఈ లక్షణాలు కలుగుతున్నాయా, లేక పౌర సేవకులు బస చేస్తున్న దేశపు వాతావరణం వంటి సహజ కారణాల వల్ల జరిగిందా అని శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కాలేదు.అంతిమంగా, ఈ రుగ్మతలు నిర్దేశిత మైక్రోవేవ్ శక్తి కారణంగా ఉండే అవకాశం ఉందని ఈ విషయంపైయు.ఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విడుదల చేసిన నివేదిక తెలిపింది[3].

సిండ్రోమ్ సంభవించిన ప్రదేశాలలో హవానాలోని హోటల్ నేషనల్ ఒకటి

చరిత్ర

మార్చు

హ‌వానా సిండ్రోమ్ తొలిసారి 2016లో క్యూబా రాజ‌ధాని హ‌వానాలో అమెరికా దౌత్యవేత్తలలో ఈ దృగ్విషయం మొదటిసారి గమనించబడింది. 2016 చివరి నాటి అసాధారణమైన, వివరించలేని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని నివేదికలు రావడం మొదలు అయ్యాయి, తరువాత కెనడియన్ దౌత్యవేత్తలు కూడా ప్రభావితమయ్యారు[4]. నెలల దర్యాప్తు తర్వాత ఈ సంఘటనకు బాధ్యులైన వ్యక్తులు ఎవరూ కనిపించనప్పటికీ, ఆ సమయంలో ట్రంప్ పరిపాలన విదేశీ దౌత్యవేత్తలకు తగినంత రక్షణ కల్పించనందున ఈ సంఘటనలకు క్యూబాను పరోక్షంగా నిందించింది . 2017లో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా ఈ లక్షణాలకు కారణమయ్యే అనిర్దిష్ట దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. ప్రతిస్పందనగా అమెరికా తన రాయబార కార్యాలయ సిబ్బందిని కనిష్ఠస్థాయికి తగ్గించింది. 2018లో జెఎఎమ్ఎ అనే జర్నల్లో ప్రచురితమైన క్యూబాలో ప్రభావితమైన దౌత్యవేత్తల తదుపరి అధ్యయనాలు, దౌత్యవేత్తలు ఏదో ఒక విధమైన మెదడు గాయానికిగురైనట్లు రుజువులను కనుగొన్నాయి, కానీ గాయాలకు గల కారణాన్ని నిర్ధారించలేదు.[5] అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మెక్రోవేవ్‍, రేడియో వేవ్‍ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు[6], క్యూబా మాత్రమేకాక జర్మ‌నీ, ఆస్ట్రియా, ర‌ష్యా, చైనాలాంటి ఇతర దేశాల్లో ప‌ని చేసే అమెరిక‌న్ అధికారుల్లో కూడా ఇది ఎక్కువ‌గా కనిపించింది[7].

లక్ష్యణాలు

మార్చు

లక్షణాలు సాపేక్షంగా నిర్దిష్టంగా ఉండవు, కానీ నరాల నష్టాన్ని సూచిస్తాయి ఆరోగ్య సమస్యలు సాధారణంగా అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి: బాధితుడు అకస్మాత్తుగా ఒక నిర్దిష్ట దిశ నుండి వస్తున్నట్లు వారు భావించిన వింత చప్పుడు వినడం ప్రారంభిస్తారు. వారిలో కొందరు దీనిని పీడనంగా లేదా కంపనంగా అనుభవించారు ఈ శబ్దాల కాలవ్యవధి కొన్ని సెకన్ల నుండి ౩౦ నిమిషాల వరకు ఉంది, ఈ లక్ష్యణాలు ఉన్నవారు సాధారణంగా తీవ్రమైన, బాధాకరమైన కంపనాలు లేదా చెవులు లేదా తలలో ఒత్తిడితో జత చేయబడిన పెద్ద శబ్దాలను వింటారు సాధారణ లక్ష్యణాలు వింత శబ్దాలు, తలనొప్పి, చెవుడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, వికారం అనుభవించడం, ప్రభావిత వ్యక్తులు వినికిడి లోపం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, వికారం వంటి లక్షణాలను వివరించారు.ప్రభావితమైన వారిలో కొ౦దరు త్వరగా కోలుకున్నప్పటికీ, మరికొ౦దరు నెలల తరబడి కొనసాగే లక్షణాలను కలిగి ఉన్నారు.ఈ ‘హవానా సిండ్రోమ్‌’ బారిన పడిన వారి మెదడు కొద్దిభాగం దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Telugu, TV9 (2021-08-26). "Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు." TV9 Telugu. Retrieved 2021-08-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Verma, Ragini; Swanson, Randel L.; Parker, Drew; Ould Ismail, Abdol Aziz; Shinohara, Russell T.; Alappatt, Jacob A.; Doshi, Jimit; Davatzikos, Christos; Gallaway, Michael; Duda, Diana; Chen, H. Isaac (2019-07-23). "Neuroimaging Findings in US Government Personnel With Possible Exposure to Directional Phenomena in Havana, Cuba". JAMA. 322 (4): 336–347. doi:10.1001/jama.2019.9269. ISSN 0098-7484. PMC 6652163. PMID 31334794.
  3. "'Havana Syndrome' likely caused by pulsed microwave energy, government study finds". NBC News (in ఇంగ్లీష్). Retrieved 2021-08-26.
  4. Washington, Associated Press in (2017-09-14). "Mystery of sonic weapon attacks at US embassy in Cuba deepens". the Guardian (in ఇంగ్లీష్). Retrieved 2021-08-26.
  5. "Cuban Diplomats Expelled After U.S. Embassy Staff 'Incidents' In Havana". NPR.org (in ఇంగ్లీష్). Retrieved 2021-08-26.
  6. https://m.dailyhunt.in/news/africa/telugu/namasthetelangaana-epaper-namasthe/havaana+sindrom+amerikaanu+kalavarapedutunna+maikrovev+daadulu-newsid-n282859476
  7. "Havana syndrome: ఏంటీ హ‌వానా సిండ్రోమ్‌.. ర‌హ‌స్య ఆయుధమా? అంతుబ‌ట్టని వ్యాధా?". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-26. Retrieved 2021-08-26.