భార్యాభర్తల సవాల్
(భార్యాభర్తల సవాల్ నుండి దారిమార్పు చెందింది)
భార్యాభర్తల సవాల్ 1983 అక్టోబరు 6న విడుదలైన తెలుగు సినిమా. పద్మజ కళా మందిర్ పతాకం కింద ఆర్. రామకృష్ణరాజు, కె.ఎల్.ఎస్.ఎస్. రామచంద్రరాజు లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు , సుమలత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు. [1]
భార్యాభర్తల సవాల్ (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖర్ రెడ్డి |
---|---|
తారాగణం | మోహన్ బాబు , సుమలత |
నిర్మాణ సంస్థ | పద్మజ కళామందిర్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మోహన్ బాబు
- సుమలత
- రావు గోపాలరావు (చక్రవర్తి),
- గొల్లపూడి మారుతీరావు (బుల్లెబ్బాయి),
- జయమాల (మేనక)
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
- నిర్మాత: ఆర్.రామకృష్ణరాజు, కె.ఎల్.ఎస్.ఎస్. రామచంద్రరాజు;
- కంపోజర్: రాజ్-కోటి
- సమర్పణ: కె. వెంకటరామ రాజు;
- సహ నిర్మాత: కె. రామరాజు
- కథ: ఎన్వీ సుబ్బరాజు
పాటలు
మార్చు- ఆ గంగా యమునా కలిసేది ప్రయాగ ఈ పసుపు కుంకుమా - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
- కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకి కోపం - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
- చిగురంత బావకు చెట్టంత కోపం డుం డుం డుం - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: డా. సినారె
- ప్రియతమా ఓ ప్రియతమా ఒకసారి ప్రేమించి చూడు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
- రానైతే వచ్చావు ఈ చోటికి ఏమిచ్చి పోతావు ఈ తోటకి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
మూలాలు
మార్చు- ↑ "Bharya Bharthala Sawal (1983)". Indiancine.ma. Retrieved 2022-12-24.