1833 నాటి చార్టర్ చట్టం
ఈ వ్యాసంతో సరిపోలే మరో వ్యాసం 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము
పూర్తి శీర్షిక | An Act for effecting an Arrangement with the East India Company, and for the better Government of His Majesty’s Indian Territories, till the Thirtieth Day of April One thousand eight hundred and fifty-four. |
---|---|
ఉల్లేఖనం | 3 & 4 Will 4 c 85 |
తేదీలు | |
రాచరికపు ఆమోదం పొందిన తేదీ | 1833 ఆగస్టు 28 |
ఇతర శాసనాలు | |
Repealed by | Government of India Act 1915 (all except section 112) |
స్థితి: Amended | |
Revised text of statute as amended |
1833 చార్టర్ చట్టం అనేది బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో చివరి దశ.[1] దీన్ని సెయింట్ హెలెనా చట్టం అని, భారత ప్రభుత్వ 1833 నాటి చట్టం అనీ, 1833వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం అనీ కూడా అంటారు.
చట్టం లక్షణాలు
మార్చు- గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ను గవర్నల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇది ప్రకటించింది. అతనికి సివిల్, మిలిటరీ అధికారాలను విధిగా చేసింది. లార్డ్ విల్లియం బెంటిక్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితుడయ్యాడు.
- బొంబాయి, మద్రాసు గవర్నర్ల శాసానాధికారాలను లాగేసింది. మొట్తమొదటి సారిగా గవర్నరు జనరలు ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం అన్నారు. యావత్తు బ్రిటిషు ఇండియా లోని శాసనాధికాఅరాల్ను గవర్నరు జనరలు, అతడి కార్యనిర్వాహక మండలికి అప్పజెప్పారు.
- బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వ్యాపార కార్యకలాపాలు ముగిసాయి. అది పూర్తి పరిపాలక సంస్థగా మారింది. మరీ ముఖ్యంగా చైనా తోటి, దూర ప్రచ్యం తోటీ దాని వ్యాపార గుత్తాధిపత్యానికి తెరపడింది.
- ప్రభుత్వాధికారుల ఎంపికకు పోటీ వ్యవస్థను ఏర్పరచింది. అయితే డైరెక్టర్లు దీన్ని వ్యతిరేకించడంతో దీన్ని పక్కనపెట్టారు. కంపెనీ అధికారుల నియామకం కంపెనీయే చెయ్యడం కొనసాగించింది
- సెయింట్ హెలీనాపై నియంత్రణ కంపెనీ నుండి రాజుకు బదలాయించింది.[2]
భారత ప్రభుత్వ చట్టం-1915 వచ్చినపుడు పైవాటిలో చివరి నిబంధన తప్ప మిగతావన్నీ రద్దయ్యాయి.[3][4]
మూలాలు
మార్చు- ↑ భారత రాజకీయ వ్యవస్థ, ఎం లక్ష్మీకాంత్, తెలుగు అనువాదం, పేజీ 1.4
- ↑ "Saint Helena Act 1833, section 112". UK Statute Law Database. 26 May 2011. Retrieved 3 August 2014.
- ↑ "Saint Helena Act 1833, sections 1–111". UK Statute Law Database. 26 May 2011. Archived from the original on 15 సెప్టెంబరు 2014. Retrieved 3 August 2014.
- ↑ "Saint Helena Act 1833, sections 113–117". UK Statute Law Database. 26 May 2011. Archived from the original on 3 సెప్టెంబరు 2014. Retrieved 3 August 2014.