1857 శీర్షికన ఆంధ్రభూమి సంపాదకుడు, బహుగ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి చరిత్ర గ్రంథాన్ని రచించారు.

రచన నేపథ్యం

మార్చు

ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది. తొలి ముద్రణ జనవరి 2007లో జరిగింది. రెండవ ముద్రణ మార్చి 2007, మూడవ ముద్రణ మే 2007, నాల్గవ ముద్రణ మార్చి 2010లలో జరిగాయి.[1]' ఈ పుస్తకం గురించి రచయిత చెబుతూ మేర లేని మతమౌఢ్యంలో, బ్రాహ్మణ విష సంస్కృతి భ్రష్టాచారాలతో కునారిల్లి అజ్ఞానాంధకారంలో వేల సంవత్సరాలు కొట్టుమిట్టాడిన మన దిక్కుమాలిన దేశానికి విజ్ఞాన ఖనులూ, నాగరికతా వైతాళికులూ అయిన తెల్లదొరలు ఎడమకాలు మోపడంతో ఎట్టకేలకు మంచిరోజులు వచ్చాయి. వారు దయతలచి విద్యాబుద్ధులు గరపడం వల్ల మనం పాత రోతనుంచి బయటపడి, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆలోచించడమెలాగో నేర్చుకుని, ఆధునిక సంస్కారాన్ని అలవరచుకున్నాం. ఇన్ని ఉపకారాలు చేసిన దొరలు సామ్రాజ్యాన్ని నిలుపుకొని, తమ ఆధిపత్యానికి ఎదురులేకుండా చేసుకునేందుకు, వలసరాజ్యం నుంచి వల్లమాలిన లబ్ధి పొందేందుకు, తమ జాతీయ స్వార్ధ ప్రయోజనాలు రక్షించుకునేందుకు మనకు ఘోరమైన అపకారాలు కూడా చేశారు. అప్పుడు మన జాతిపితలూ, పితామహులూ పూనుకుని దొరల విజ్ఞతను విశ్వసించి, అనేక విజ్ఞప్తులు చేసి, పిటీషన్లు వల్ల పనికాకపోతే, అహింసాయుతంగా బ్రిటీష్ సామ్రాజ్యానికి మరీ ప్రమాదం లేకుండా మర్యాదపూర్వకంగా ఉద్యమాలు నడిపి, లాఠీలకు ఒళ్ళప్పగించి, అనేక దశాబ్దాలు వీరోచితంగా కష్టపడి ఎట్టకేలకు స్వాతంత్య్రం సాధించారు' అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మహాజ్ఞానులు చెబితే విన్నాం. అదే అక్షరసత్యమని నమ్మేస్తున్నాం. మనకు తెలిసిన జాతీయత, మనం అనుకునే జాతీయోద్యమం కళ్ళు తెరవటానికి అనేక దశాబ్దాలు పూర్వమే 1857లో ఈ దేశంలో లక్షలమంది ఆయుధాలు పట్టి విదేశీ రాకాసులపై సంవత్సరానికి పైగా భీషణ సంగ్రామం సాగించారంటే మనకు ఏమిటోగా ఉంటుంది అది- సిపాయిలను రెచ్చగొట్టి, పావుల్లా వాడుకుని, అభివృద్ధి నిరోధక ఫ్యూడల్ శక్తులు తమ ఆస్తులకోసం, ఆధిపత్యాలకోసం, దోచుకునే హక్కులకోసం సాగించిన బీభత్సమని మనం పెద్దలనుకునే వారు చెబుతూ వస్తున్నదే నిజమని నమ్మబుద్ధేస్తుంది. కనీసం 150 ఏళ్లు నిండే ఘట్టంలోనైనా నాటి వైఫల్యాలను సమీక్షించి, వాటి వెలుగులో నేటి దౌర్బల్యాలను అర్ధం చేసుకుని, వాటిని పరిహరించి భవితకు బాట వేసుకునేందుకు జాతి జనులు ఉద్యుక్తమవాలన్న ఆకాంక్షే అని పేర్కొన్నారు . ఈ గ్రంధం చరిత్ర ప్రవీణుల కోసం కాదు. చరిత్ర గతిని అర్ధం చేసుకుని, జాతి జీవనరీతిని సరిదిద్దుకోవాలని కోరుకునే సామాన్యుల కోసం అని చెప్పారు .

పుటలు

మార్చు

332

అంకితం

మార్చు

గ్రంథకర్త ఈ పుస్తకాన్ని ఆదర్శ గురువు, ఆదర్శ పౌరుడు, నడిచే శివుడు సద్గురు శ్రీ శివానందమూర్తికి అంటూ తన గురువుకు అంకితమిచ్చారు.

రచయిత గురించి

మార్చు

ప్రధాన వ్యాసం: ఎం.వి.ఆర్.శాస్త్రి
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, రచయిత. ఆయన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1994 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. పదిహేడేళ్ళుగా ఉన్నమాట, వీక్ పాయింట్ శీర్షికలు నిర్వహిస్తున్నారు. మన చదువులు, ఉన్నమాట, వీక్ పాయింట్, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఏది చరిత్ర, ఇదీ చరిత్ర, ఆంధ్రుల కథ వంటి పుస్తకాలు రచించారు.

ప్రధానాంశం

మార్చు

1957 పుస్తకానికి మనం మరచిన మహా యుద్ధం అన్న ఉపశీర్షికని ఉంచారు. గ్రంథంలో 1857లో ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని గురించి చారిత్రికులు పలువురు పితూరీ, చిల్లర తిరుగుబాటుగా అభివర్ణించారని, అది చాలా పొరపాటని వివరిస్తూ ఎం.వి.ఆర్.శాస్త్రి రచించారు.

వ్యాసాలు

మార్చు

1857 పుస్తకం పలు వ్యాసాల సంకలనం. ఆ వ్యాసలు ఇవి:[2]

  • మనం మరచిన మహా యుద్ధం
  • ఎందుకంత లేటు
  • దొరవార్ల దయ
  • దండం పెట్టకుంటే దండం
  • అయ్యో మతం!
  • ధర్మప్రభువు డల్హౌసీ
  • సిపాయిల పాట్లు
  • తూటాల తంటా
  • మంగళ్ పాండే
  • సిపాయిలకు సంకెళ్ళు
  • మీరట్, మే 10
  • బూజుపట్టిన రాజు
  • చలో ఢిల్లీ
  • కోటలో పాగా
  • ఎందుకొచ్చిన రాజరికం?!
  • భ్రష్టులా? ద్రష్టలా?
  • కుట్రల పుట్ట
  • కుట్రదారులెవరు?
  • ఇదిగో నజరానా!
  • నాదిర్షా నయం
  • శభాష్ కూపర్
  • దొరరూప రాక్షసులు
  • పీష్వా పింపర్నల్
  • వీరశూర నానా
  • ఊచకోతల రాయుడు
  • ఔరా! అవథ్!!
  • ఎన్నాళ్లకెన్నాళ్లకు!
  • మనకూ వారికీ ఎంత తేడా!
  • హజ్రత్ మహల్
  • వీరనారి లక్ష్మీబాయి
  • మేరీ ఝాన్సీ దూంగీ నహీ
  • ఇంకో ఊచకోత
  • యుద్ధానికి సన్నద్ధం
  • బాబోయ్! ఝాన్సీ!!
  • కూలిపోయిన కోట
  • ఇది కాదా ప్రజాయుద్ధం
  • ఏడీ సేనాపతి?
  • వహ్వా! గ్వాలియర్
  • రాలిపోయిన రాణి
  • దక్షిణాది తీసిపోయిందా?
  • రెసిడెన్సీ ముట్టడి
  • తిరగబడ్డ తెలుగు గడ్డ
  • జాతీయ యుద్ధం కాదా?
  • ఎవరు వీరులు?
  • ఎవరు క్రూరులు?
  • ధర్మయుద్ధం
  • ఎందుకు ఓడాము?
  • పనికొచ్చిన పుస్తకాలు
  • 1857 ఫోటోలు కొన్ని

మూలాలు

మార్చు
  1. 1857:ఎం.వి.ఆర్.శాస్త్రి:2010 ముద్రణ
  2. 1857:ఎం.వి.ఆర్.శాస్త్రి:2010:ఇదీ వరస(విషయసూచిక)