1991 పంజాబ్ హత్యలు
30°52′59″N 75°51′00″E / 30.883°N 75.85°E
1991 పంజాబ్ హత్యలు అన్నది జూన్ 17, 1991న భారతదేశానికి చెందిన పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా జిల్లాలో రైలు ప్రయాణికులు లక్ష్యంగా సాగిన హత్యాకాండ. ఇందులో భాగంగా సిక్కు ఉగ్రవాదులు భారతదేశానికి చెందిన లూధియానా నగరం సమీపంలో రెండు రైళ్ళలో ప్రయాణిస్తున్న 80 నుంచి 126 మంది ప్రయాణికులను హత్యచేశారు.[1] ఉగ్రవాదులు రెండు రైళ్ళను లూధియానా స్టేషన్ కు కిలోమీటర్ ముందు చైన్ లాగి, ఎమర్జెన్సీ బ్రేకులను సచేతనం చేయడం ద్వారా నిలిపివేశారు. రైళ్ళలో తుపాకులతో దాడి ప్రారంభించి కనీసం 80 మంది ప్రయాణికులను చంపేశారు. ఈ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడ్డవారు చెప్పినదాని ప్రకారం రెంటిలో ఒక రైలులో హిందూ ప్రయాణికులను వేరు చేసి గుర్తించి చంపారు. ఈ రైలులో దాడిచేసినవారు రైలులో తిరుగుతూ హిందువులను గుర్తించి చంపుతూ, సిక్ఖులను వదిలివేశారు. రెండవ రైలులో మిలిటెంట్లు అలాంటి వివక్షలేకుండా కాల్పులు జరిపారు. ఆపైన దుండగులు పారిపోయారు, రైలు బుద్ధువాల్ స్టేషన్ కు వెనుదిరిగింది, అక్కడ రెస్క్యూ టీం డాక్టర్లతో సహా చేరుకుంది. సమీప గ్రామస్థులు ఆహారం, నీరు, ఔషధాలు, మానసిక స్థైర్యం అందించి బతికివున్నవారికి మద్దతిచ్చారు. ఏప్రిల్ 1991లో ఎన్నికల ప్రకటన వెలువడగా జూన్ నాటికల్లా రాష్ట్రంలో 700 మంది మరణించారు.[2]
1991 పంజాబ్ హత్యలు | |
---|---|
ప్రదేశం | లూధియానా జిల్లా, పంజాబ్, భారతదేశం |
తేదీ | 15 జూన్ 1991 |
మరణాలు | 80-126 |
ఇదే సంవత్సరం దీన్నే పోలిన సంఘటనలో 1991 డిసెంబరులో లూధియానా నుంచి ఫిరోజ్ పూర్ కు వెళ్తూన్న రైలుపై దాడిచేసి దుండగులు 49మంది (చాలావరకూ హిందువులు) ప్రయాణికులను హత్యచేశారు.[3]
మూలాలు
మార్చు- ↑ "Sikhs attack India trains, killing 126". Chicago Sun-Times. June 17, 1991. Archived from the original on 2018-12-25.
- ↑ Extremists in India Kill 80 on 2 Trains As Voting Nears End, The New York Times (June 16, 1991)
- ↑ 49 Slain by Gunmen on Train in India, The New York Times (December 27, 1991)