19 వ శతాబ్దం

శతాబ్దం

19వ శతాబ్ది (1 జనవరి 1801 – 31 డిసెంబర్ 1900) స్పానిష్, నెపోలియనిక్, పవిత్ర రోమన్, ముఘల్ సామ్రాజ్యాల పతనాన్ని చూసిన శతాబ్దం. ఇది బ్రిటీష్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, యునైటెడ్ స్టేట్స్, జర్మన్ సామ్రాజ్యం, ఫ్రెంచ్ వలస సామ్రాజ్యం, మీజీ జపాన్ ల ప్రాబల్యం పెరిగేందుకు దోహదపడింది, ప్రత్యేకించి బ్రిటీష్ వారు 1815 నుంచి ఎదురులేని ప్రాబల్యాన్ని స్థాపించుకోగలిగారు. నెపోలియనిక్ యుద్ధాల్లో ఫ్రెంచ్ సామ్రాజ్యం, దాని మిత్ర రాజ్యాలు ఓటమి చెందాకా బ్రిటీష్, రష్యన్ సామ్రాజ్యాలు విపరీతంగా విస్తరించి, ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా నిలిచాయి. రష్యన్ సామ్రాజ్యం మధ్య ఆసియా, తూర్పు ఆసియాల్లో విస్తరించింది. బ్రిటీష్ సామ్రాజ్యం తొలి అర్థ శతాబ్దిలో అత్యంత వేగంగా విస్తరించింది. ప్రత్యేకించి కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లోని విస్తారమైన ప్రాంతం, అత్యంత జనాభా కలిగిన భారతదేశం వంటి ప్రాంతాలను ఆక్రమించింది. శతాబ్ది గడిచేసరికి బ్రిటీష్ సామ్రాజ్యం ప్రపంచంలో 5వ వంతు భూమి, 4వ వంతు జనాభా కలిగివుంది.  పోస్ట్-నెపోలియన్ యుగంలో ప్రస్తుతం పాక్స్-బ్రిటానికా అని పిలుచుకునే పరిణామాన్ని బ్రిటీష్ సామ్రాజ్యం తీసుకురావడంతో, ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, పెద్ద ఎత్తున ఆర్థిక అనుసంధానం వంటివాటికి నేపథ్యంగా నిలిచింది.

1808లో ఆంటోనీ-జీన్ గ్రోస్ మాడ్రిడ్ లొంగుబాటు. 1810లో ద్వీపకల్ప యుద్ధం కాలంలో నెపోలియన్ స్పెయిన్ రాజధానిలోకి అడుగుపెట్టాడు.