2016 నాటి ఎఎన్-32 విమాన అదృశ్యం
2016 జూలై 22 న, భారత వైమానిక దళానికి చెందిన ఏంటోనోవ్ ఎఎన్ -32 ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ రవాణా విమానం బంగాళాఖాతం మీదుగా ఎగురుతున్నప్పుడు అదృశ్యమైంది.[1] ఈ విమానం చెన్నై లోని తాంబరం వైమానిక దళ కేంద్రం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ వరకు వెళుతోంది. విమానంలో 29 మంది ఉన్నారు. ఉదయం 9:12 గంటలకు, చెన్నై నుండి తూర్పున 280 కి.మీ. దూరాన ఉండగా విమానంతో రాడార్ సంపర్కం కోల్పోయింది.[2][3] సముద్రంలో తప్పిపోయిన విమానాన్ని వెతకడం కోసం భారతదేశం అతి పెద్ద ఆపరేషన్ను చేపట్టింది.[4]1986, 2019 లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
అదృశ్యం సారాంశం | |
---|---|
తేదీ | 22 జూలై 2016 |
సారాంశం | అదృశ్యం, సముద్రంలో కూలిపోయినట్లు భావిస్తున్నారు |
ప్రదేశం | బంగాళాఖాతం |
ప్రయాణీకులు | 23 |
సిబ్బంది | 6 |
మరణాలు | 29 (భావిస్తున్నారు) |
బ్రతికున్నవారు | 0 |
విమానం రకం | ఏంటొనోవ్ ఎఎన్-32 |
ఆపరేటర్ | భారతీయ వాయుసేన |
విమాన రిజిస్ట్రేషన్ | K-2743 |
విమాన మూలం | తాంబరం వాయుసేన కేంద్రం చెన్నై |
గమ్యం | పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు |
ప్రయాణీకులు
మార్చువిమానంలో 29 మంది ఉన్నారు: ఆరుగురు సిబ్బంది; 11 మంది భారత వైమానిక దళ సిబ్బంది; భారతీయ సైన్యానికి చెందిన ఇద్దరు సైనికులు; భారతీయ నౌకాదళానికి, భారత తీర రక్షక దళానికీ చెందిన వారు ఒక్కొక్కరు; నావల్ ఆర్మమెంట్ డిపో (NAD) లో పనిచేస్తున్న ఎనిమిది మంది పౌర ఉద్యోగులు. [5] [6] ఈ పౌర ఉద్యోగులు విశాఖపట్నానికి చెందినవారు. [7]
అదృశ్యం, అన్వేషణ
మార్చుఏంటోనోవ్ ఎఎన్ -32 2016 జూలై 22 న ఉదయం 8:30 గంటలకు చెన్నైలోని తాంబరం వైమానిక దళ కేంద్రం నుండి బయలుదేరింది. ఇది 11:45 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌లో దిగాల్సి ఉంది. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక జలాంతర్గామి, 12 ఉపరితల నౌకలు, ఐదు విమానాలనూ ఉపయోగించి పెద్ద సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించాయి. [6]
అదృశ్యమైన మూడవ రోజున, తప్పిపోయిన ఎఎన్ -32 ను వెతకడానికి చెన్నైకి తూర్పున 150 నాటికల్ మైళ్ళ దూరంలో 16 నౌకలను, ఒక జలాంతర్గామిని, ఆరు విమానాలనూ మోహరించారు. [8] [9] విమానంలో అండర్వాటర్ లొకేటర్ బెకన్ (యుఎల్‌బి) లేదని ఆగస్టు 1 న నిర్ధారించారు. [10] [11] దీనికి రెండు అత్యవసర లొకేటర్ ట్రాన్స్మిటర్లు (ELT లు) ఉన్నాయి.
2016 సెప్టెంబరు 15 న, అన్వేషణ కార్యక్రమాన్ని ఆపేసారు; విమానంలో ఉన్న మొత్తం 29 మందీ చనిపోయినట్లు భావించారు. ఇదే సంగతి వారివారి కుటుంబాలకు తెలియజేసారు. [12] [13] [14]
మూలాలు
మార్చు- ↑ "ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం". సాక్షి. 2016-07-22. Archived from the original on 2019-10-08. Retrieved 2019-10-08.
- ↑ "IAF An-32 aircraft developed 3 snags in July alone". Indian Express. Retrieved 2016-07-22.
- ↑ "India launches massive search operation for missing military plane". BBC. Retrieved 2016-07-22.
- ↑ "India's Biggest Search Ever To Find A Plane That Crashed In The Sea". Retrieved 2 December 2016.
- ↑ "Indian Air Force's AN-32 Plane With 29 Missing After 'Rapid Loss of Altitude'". NDTV. Retrieved 2016-07-22.
- ↑ 6.0 6.1 "Indian Air Force plane Antonov AN-32 missing, 8 naval armaments personnel onboard". First Post. Retrieved 2016-07-22.
- ↑ "Updates: IAF AN-32 aircraft with 29 aboard missing, search on". Retrieved 2016-07-22.
- ↑ "Hunt for missing Indian Air Force plane goes into third day – Times of India". Retrieved 2 December 2016.
- ↑ "Indian Air Force AN-32 plane still missing: A pilot looks at what could have gone wrong". Retrieved 2 December 2016.
- ↑ "Missing IAF AN-32 aircraft did not have underwater locator beacon". Retrieved 2 December 2016.
- ↑ "Missing AN-32 plane: Lack of underwater locator hindering search". Retrieved 2 December 2016.
- ↑ "Exclusive: Those on board ill-fated AN-32 declared dead, IAF writes to family members". Retrieved 2016-09-15.
- ↑ "AN-32 disaster must help indigenous repair capabilities take off the ground". Retrieved 2016-09-15.
- ↑ "All 29 onboard missing IAF AN-32 have been officially presumed dead". Archived from the original on 2016-09-17. Retrieved 2016-09-15.