2019 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు
2019 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అన్నది బ్రెజిల్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇన్‌స్టిట్యో నేషియోనల్ దె పేస్క్యీసాస్ ఎస్పాషియాస్- ఐఎన్‌పీఈ) బ్రెజిల్లో 2019 జనవరి నుంచి ఆగస్టు 23 వరకు 75,336 కార్చిచ్చులు రేగాయని, ఐఎన్‌పీఈ 2013లో ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షిస్తూ కార్చిచ్చుల డేటా సేకరించడం మొదలుపెట్టిన నాటి నుంచీ ఇదే అతిపెద్దదని ప్రకటించాకా వైజ్ఞానిక సమాజం దృష్టిలోకి వచ్చింది.[2]
2019 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు | |
---|---|
Location | బ్రెజిల్ |
Statistics | |
Date(s) | January 2019 — ప్రస్తుతం సాగుతోంది |
Fatalities | 2[1] |
Map | |
దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల సరిహద్దు (దాదాపుగా) |
అమెజాన్ వర్షారణ్యంలో 60 శాతానికి పైగా బ్రెజిల్లో ఉంది,[3][4] దేశంలో ఇటీవల రేగిన కార్చిచ్చుల్లో సగానికి పైగా అమెజాన్ అడవుల్లోనే ఏర్పడ్డాయి.[5] ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిన గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో ప్రపంచపు అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ అడవులు కీలకం. ఈ పరిస్థితి పర్యావరణంపై పనిచేసే ఎన్‌జీవోలను, ఫ్రాన్స్ దేశాన్ని, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో సంస్థలు, వ్యక్తులను కలవరపరిచింది. ఆగస్టు 20 నాటికి అమెజానాస్, రోండానియా, మాటో గ్రాసో, పారా అన్న నాలుగు బ్రెజిల్ రాష్ట్రాల్లోని అమెజాన్ అడవులను కార్చిచ్చు తగులబెడుతోంది.[6]
ఆగస్టు 11న అమెజానాస్ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది.[7][8] ఈ రాష్ట్రం బ్రెజిల్‌లో విస్తీర్ణం పరంగా అతిపెద్దది కావడమే కాక ప్రపంచంలో అవిచ్ఛిన్నంగా విస్తరించిన రెయిన్‌ఫారెస్ట్‌లలో అతిపెద్దది ఇక్కడే ఉంది. బ్రెజిల్ దేశ ప్రభుత్వం మాత్రం ఈ డేటా మీద సందేహాలు వ్యక్తం చేస్తోంది.
నేపథ్యం
మార్చు67 కోట్ల హెక్టార్లలో 60 శాతం అమెజాన్ వర్షారణ్యం బ్రెజిల్‌లో ఉంది.[9][10] 1970ల్లో దాదాపు 77.69 కోట్ల హెక్టార్లలో ఉండే వర్షారణ్యాన్ని ఐదు దశాబ్దాల్లో బ్రెజిల్ 12 శాతం మేరకు కొట్టేసింది.[11] ఈ కొట్టేసిన అడవి విస్తీర్ణంలో భారతీయ రాష్ట్రమైన బీహార్ అంత ఉంటుంది.[12] ఇందులో చాలావరకు కలప వ్యాపారం కోసం, వ్యవసాయం చేయడానికి భూమి కోసం కొట్టారు. వాన పడని కాలంలో వ్యవసాయం, పశువుల మేత కోసం అక్రమంగా చెట్లు కొట్టి తగులబెట్టడం ద్వారా అడివిని నిర్మూలించడం బ్రెజిల్లో వాడుక. బ్రెజిల్ నుంచి జరిగే గొడ్డుమాంసం ఎగుమతికి, ప్రత్యేకించి చైనా, హాంగ్ కాంగ్ దేశాల్లో, డిమాండ్ పెరుగుతూ ఉండడం వల్ల పశుపోషణ కోసం అడవులు తగులబెట్టే పద్ధతులు అనుసరించడం మరింత పెరిగింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా గొడ్డుమాంసం వినియోగంలో 20 శాతం బ్రెజిల్ నుంచే వస్తూంది. వానలు ఆగే పొడి కాలం వరకూ ఆగి పశువులను మేపేందుకు తగ్గ సమయం వరకు ఇచ్చి పశుపాలకులు అడవి కొట్టి తగలబెట్టడం ప్రారంభిస్తారు.[13] ఈ అడవిని కొట్టి తగలబెట్టే ప్రక్రియని జాగ్రత్తగా చేస్తూ నియంత్రించవచ్చు, నైపుణ్యం లేని వ్యవసాయదారులు నియంత్రించలేక కార్చిచ్చుకు కారణం కావచ్చు. యూరోన్యూస్ ప్రకారం, వ్యవసాయ రంగాన్ని అమెజాన్ బేసిన్లోకి తీసుకుపోయి, అటవీ నిర్మూలన ప్రారంభించాకా కార్చిచ్చులు బాగా పెరిగాయి. ఇటీవలి కాలంలో అక్రమంగా భూమి ఆక్రమించుకునేవారు (గ్రిలేరోస్ అని బ్రెజిల్లో వ్యవహారం) బ్రెజిల్లో అమెజాన్ వ్యాప్తంగా లోతైన అటవీ ప్రాంతంలోనూ, రక్షిత అటవీ ప్రాంతంలోనూ చట్టవిరుద్ధంగా అడవులు కొడుతున్నారు.
గతంలో అమెజాన్ వర్షారణ్యంలో అటవీ నిర్మూలనకు బ్రెజిల్ చాలా చురుకుగా ఉండేది, అనుకూలమైన విధానాన్ని అనుసరించేది. 2004లో భూమి వినియోగాన్ని నియంత్రించి, పర్యావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తూ, పర్యావరణానికి హానిచేయని అభివృద్ధి కార్యకలాపాలు ప్రోత్సహించేలాంటి ప్రభుత్వ, ప్రైవేటు స్థాయి భాగస్వామ్యాలు చేపట్టి, వీటి ఉల్లంఘనల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అటవీ నిర్మూలన వేగాన్ని తగ్గించే లక్ష్యంతో బ్రెజీలియన్ ప్రభుత్వం ఫెడరల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రవెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డీఫారెస్టేషన్ ఇన్ ద అమెజాన్ (పీపీసీడీఏఎం) తీసుకువచ్చింది.[14] పీపీసీడీఏఎం అమలుచేయడం వల్ల 2004 నాటికి జరుగుతున్న అటవీ నిర్మూలనలో 83.5 శాతం వరకు 2012 కల్లా పడిపోయింది.[15]
పీపీసీడీఏఎం కార్యక్రమానికి మద్దతుగా బ్రెజిల్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇన్‌స్టిట్యో నేషియోనల్ దె పేస్క్యీసాస్ ఎస్పాషియాస్- ఐఎన్‌పీఈ) అమెజాన్ వర్షారణ్యాన్ని పర్యవేక్షించే పద్ధతులను అభివృద్ధి చేసింది. వార్షిక పద్ధతిలో కార్చిచ్చులను, నిర్మూలనమైన అడవిని అంచనా కట్టడానికి అత్యంత సూక్ష్మంగా అమెజాన్ అటవీనిర్మూలన ఉపగ్రహ పర్యవేక్షణ ప్రాజెక్టు (అమెజాన్ డీఫారెస్టేషన్ శాటిలైట్ మానిటరింగ్ ప్రాజెక్ట్ - పీఆర్ఓడీఈఎస్) అన్న అతి సూక్ష్మమైన ఉపగ్రహ చిత్ర ఆధారిత విధానం ఈ క్రమంలో తొలి ప్రయత్నాల్లో ఒకటి. [16] 2015లో ఐఎన్‌పీఈ అటవీ నిర్మూలనను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు దీనికి పరిపూరకమైన మరో ఐదు ప్రాజెక్టులు ప్రారంభించింది. రియల్-టైం డీఫారెస్టేషన్ డిటెక్షన్ సిస్టమ్ (డీఈటీఈఆర్) ఉపగ్రహ హెచ్చరిక పద్ధతి 14 రోజుల సైకిల్స్ లో కార్చిచ్చు సంఘటనలను గ్రహించగలిగేది. బ్రెజీలియన్ వాతావరణ సంస్థ ప్రభుత్వ వెబ్సైట్లో నెలవారీగానూ, రోజువారీగానూ డేటా ప్రచురించడం, తర్వాత దాన్ని వార్షికంగా ప్రచురించేప్పుడు మరింత ఖచ్చితమైన పీఆర్ఓడీఈఎస్ డేటాతో సరిజూసి ప్రచురించడం ప్రారంభించారు.[17][18][19][20]
2019 కార్చిచ్చులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Moreira, Rinaldo; Valley, Jamari (August 15, 2019). "Casal morre abraçado ao tentar fugir de queimada em RO" [Couple die hugged while trying to escape burnt out RO]. G1 (in portuguese). Archived from the original on August 15, 2019. Retrieved August 22, 2019.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Andreoni, Manuela; Hauser, Christine (August 21, 2019). "Fires in Amazon Rain Forest Have Surged This Year". The New York Times. Rio de Janeiro. Retrieved August 21, 2019.
- ↑ "Deforestation dropped 18% in Brazil's Amazon over past 12 months". Associated Press. Sao Paulo. November 26, 2014. ISSN 0261-3077. Retrieved August 22, 2019 – via The Guardian.
- ↑ Alexander Zaitchik (July 6, 2019). "In Bolsonaro's Brazil, a Showdown Over Amazon Rainforest". The Intercept and Pulitzer Center on Crisis Reporting. Retrieved August 21, 2019.With contributions by Mauro Toledo Rodrigues
- ↑ Yeung, Jessie; Alvarado, Abel (August 21, 2019). "Brazil's Amazon rainforest is burning at a record rate". CNN. Turner Broadcasting System, Inc. Retrieved August 21, 2019.
- ↑ "Fires in Brazil". The Earth Observatory (in ఇంగ్లీష్). NASA. 2019-08-16. Retrieved 2019-08-23.
- ↑ Paraguassu, Lisandra (August 20, 2019). "Amazon burning: Brazil reports record forest fires". Euronews. Retrieved August 21, 2019.
- ↑ Irfan, Umair (August 20, 2019). "Amazon rainforest fire: Forests in Brazil, Greenland, and Siberia are burning". Vox. Retrieved August 21, 2019.
- ↑ D’Amore, Rachael (August 21, 2019). "Amazon rainforest fires: What caused them and why activists are blaming Brazil's president". Global News. Retrieved August 21, 2019.
- ↑ "Forest fires in the Amazon blacken the sun in São Paulo - Darkness on the edge of town", The Economist, August 22, 2019, retrieved August 22, 2019
- ↑ "Forest fires in the Amazon blacken the sun in São Paulo - Darkness on the edge of town", The Economist, August 22, 2019, retrieved August 22, 2019
- ↑ "Indian states and territories census" (PDF). Govt. of Bihar. Archived from the original (PDF) on 13 మే 2015. Retrieved 6 June 2014.
- ↑ Mackintosh, Eliza (August 23, 2019). "The Amazon is burning because the world eats so much meat". CNN. Retrieved August 23, 2019.
- ↑ Cesar Guerreiro Diniz; Arleson Antonio de Almeida Souza; Diogo Corrêa Santos; Mirian Correa Dias; Nelton Cavalcante da Luz; Douglas Rafael Vidal de Moraes; Janaina Sant’Ana Maia; Alessandra Rodrigues Gomes; Igor da Silva Narvaes; Dalton M. Valeriano; Luis Eduardo Pinheiro Maurano; Marcos Adami (July 2015). "DETER-B: The New Amazon Near Real-Time Deforestation Detection System". IEEE Journal of Selected Topics in Applied Earth Observations and Remote Sensing. 8 (7): 3619–3628. Bibcode:2015IJSTA...8.3619D. doi:10.1109/JSTARS.2015.2437075.
- ↑ Javier Godar; Toby A. Gardner; E. Jorge Tizado; Pablo Pacheco (June 9, 2015). "Actor-specific contributions to the deforestation slowdown in the Brazilian Amazon". Proceedings of the National Academy of Sciences. 111 (43): 15591–15596. doi:10.1073/pnas.1322825111.
- ↑ Escobar, Herton (July 28, 2019). "Deforestation in the Amazon is shooting up, but Brazil's president calls the data 'a lie'". Science. Retrieved August 23, 2019.
- ↑ Phillips, Dom (2019-08-02). "Brazil space institute director sacked in Amazon deforestation row". The Guardian. ISSN 0261-3077. Retrieved 2019-08-22.
- ↑ Watts, Jonathan (August 21, 2019). "Jair Bolsonaro claims without evidence that NGOs are setting fires in Amazon rainforest". The Guardian. ISSN 0261-3077. Retrieved August 22, 2019.
- ↑ "Burned Program". Portal do Programa Queimadas do INPE. Archived from the original on 2019-09-14. Retrieved August 22, 2019.
- ↑ Carolina Moreno, Ana (July 3, 2019). "Desmatamento na Amazônia em junho é 88% maior do que no mesmo período de 2018". Natureza (in బ్రెజీలియన్ పోర్చుగీస్). Globo. Retrieved August 22, 2019.