సార్వత్రిక సమన్వయ సమయం

గడియారాలు మరియు సమయాన్ని ప్రపంచాన్ని నియంత్రించే ప్రాథమిక సమయ ప్రామాణికం
(Coordinated Universal Time నుండి దారిమార్పు చెందింది)

సార్వత్రిక సమన్వయ సమయం, (ఆంగ్లం: Coordinated Universal Time , ఫ్రెంచ్: Temps universel coordonné) లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వకాల ప్రామాణికం.[1] యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం ఖచ్చితత్వం 0o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. [2] ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం (GMT) ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారతదేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.

ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం

మూలాలు మార్చు

  1. "COORDINATED UNIVERSAL TIME (UTC)" (PDF). Retrieved April 23, 2017.
  2. Guinot, Bernard (August 2011). "Solar time, legal time, time in use". Metrologica. 48 (4): S181–185. Bibcode:2011Metro..48S.181G. doi:10.1088/0026-1394/48/4/S08.

వెలుపలి లంకెలు మార్చు