HIV
HIV (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) అనేది మానవులకు సంక్రమించే లెంటివైరస్ జాతికి చెందిన వైరస్. ఈ వైరస్ సోకిన వారు కాలక్రమంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడతారు.[1][2] దీనివల్ల రోగనిరోధక శక్తి క్రమంగా విఫలమవుతూ క్యాన్సర్, ఇంకా ఇతర ప్రాణాంతక అవకాశవాద సంక్రమణలను కలిగిస్తుంది.[3] ఎటువంటి చికిత్స చేయకపోతే, సోకినవారు వైరస్ ఉపవర్గాన్ని బట్టి, సగటున 9 నుంచి 11 సంవత్సరాలు జీవిస్తారు.[4]
చాలా కేసుల్లో ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా సంక్రమిస్తుంది. రక్త మార్పిడి, జననేంద్రియాల స్రావాల మార్పిడి సంక్రమణకు ప్రధాన కారణాలు.[5][6] లైంగిక సంబంధం కాకుండా గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ ఉంటే అది, జనన సమయంలో తల్లి రక్తం, ఉమ్మనీరు, తల్లి పాల ద్వారా కడుపులోని బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంటుంది.[7][8][9][10]
వైరాలజీ
మార్చువర్గీకరణ
మార్చుహెచ్.ఐ.వి వైరస్ రెట్రోవైరస్ కుటుంబానికి చెందిన లెంటివైరస్ అనే జాతికి చెందినది. HIV-1, HIV-2 అనే రెండు రకాల వైరస్‌లు ఉన్నాయి. HIV-1 అనేది మొదట కనిపెట్టబడింది. HIV-1 అనేది HIV-2 తో పోలిస్తే ఎక్కువ సాంక్రమిక శక్తి, తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.[11] ప్రపంచ వ్యాప్తంగా HIV ఇన్‌ఫెక్షన్లు ఈ రకం ద్వారానే సోకుతున్నాయి.
నిర్మాణం
మార్చుHIV నిర్మాణంలో ఇతర రెట్రో వైరస్‌లను పోలి ఉంటుంది. ఇది దాదాపు గోళాకారంలో ఉంటుంది. దీని వ్యాసం సుమారు 120 నానోమీటర్లు. ఇది ఎర్ర రక్త కణం కన్నా సుమారు లక్ష రెట్లు చిన్నది.
మూలాలు
మార్చు- ↑ Weiss RA (May 1993). "How does HIV cause AIDS?". Science. 260 (5112): 1273–9. Bibcode:1993Sci...260.1273W. doi:10.1126/science.8493571. PMID 8493571.
- ↑ Douek DC, Roederer M, Koup RA (2009). "Emerging Concepts in the Immunopathogenesis of AIDS". Annual Review of Medicine. 60: 471–84. doi:10.1146/annurev.med.60.041807.123549. PMC 2716400. PMID 18947296.
- ↑ Powell MK, Benková K, Selinger P, Dogoši M, Kinkorová Luňáčková I, Koutníková H, Laštíková J, Roubíčková A, Špůrková Z, Laclová L, Eis V, Šach J, Heneberg P (2016). "Opportunistic Infections in HIV-Infected Patients Differ Strongly in Frequencies and Spectra between Patients with Low CD4+ Cell Counts Examined Postmortem and Compensated Patients Examined Antemortem Irrespective of the HAART Era". PLOS ONE. 11 (9): e0162704. Bibcode:2016PLoSO..1162704P. doi:10.1371/journal.pone.0162704. PMC 5017746. PMID 27611681.
- ↑ UNAIDS; WHO (December 2007). "2007 AIDS epidemic update" (PDF). p. 16.
- ↑ Rodger AJ, Cambiano V, Bruun T, Vernazza P, Collins S, Degen O, et al. (June 2019). "Risk of HIV transmission through condomless sex in serodifferent gay couples with the HIV-positive partner taking suppressive antiretroviral therapy (PARTNER): final results of a multicentre, prospective, observational study". Lancet. 393 (10189): 2428–2438. doi:10.1016/S0140-6736(19)30418-0. PMC 6584382. PMID 31056293.
- ↑ Eisinger RW, Dieffenbach CW, Fauci AS (February 2019). "HIV Viral Load and Transmissibility of HIV Infection: Undetectable Equals Untransmittable". JAMA. 321 (5): 451–452. doi:10.1001/jama.2018.21167. PMID 30629090. S2CID 58599661.
- ↑ Mabuka J, Nduati R, Odem-Davis K, Peterson D, Overbaugh J (2012). Desrosiers RC (ed.). "HIV-Specific Antibodies Capable of ADCC Are Common in Breastmilk and Are Associated with Reduced Risk of Transmission in Women with High Viral Loads". PLOS Pathogens. 8 (6): e1002739. doi:10.1371/journal.ppat.1002739. PMC 3375288. PMID 22719248.
- ↑ Hahn RA, Inhorn MC, eds. (2009). Anthropology and public health : bridging differences in culture and society (2nd ed.). Oxford: Oxford University Press. p. 449. ISBN 978-0-19-537464-3. OCLC 192042314.
- ↑ Mead MN (2008). "Contaminants in human milk: weighing the risks against the benefits of breastfeeding". Environmental Health Perspectives. 116 (10): A426–34. doi:10.1289/ehp.116-a426. PMC 2569122. PMID 18941560. Archived from the original on 6 నవంబరు 2008.
- ↑ మూస:Citation-attribution
- ↑ Gilbert PB, McKeague IW, Eisen G, Mullins C, Guéye-NDiaye A, Mboup S, Kanki PJ (February 28, 2003). "Comparison of HIV-1 and HIV-2 infectivity from a prospective cohort study in Senegal". Statistics in Medicine. 22 (4): 573–593. doi:10.1002/sim.1342. PMID 12590415. S2CID 28523977.