ఇందూ జ్ఞాన వేదిక

(Indu gnana vedika నుండి దారిమార్పు చెందింది)

ఇందూ జ్ఞాన వేదిక త్రైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే లక్ష్యంతో, త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద రచనలు, ప్రసంగాలను వెలువరిస్తున్న ప్రచురణ సంస్థ. 2004లో ప్రబోధానంద ఈ సంస్థను ప్రారంభించాడు. ఇందూ జ్ఞాన వేదిక ప్రచారం చేస్తున్న త్రైత సిద్ధాంతం అనుసరించి భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాల్లోని ఆధ్యాత్మిక జ్ఞానం, మనుషులందరికీ మతాలతో ప్రసక్తి లేకుండా ఒకడే దేవుడనీ బోధిస్తుంది. ఇందు అనగా చంద్రుడు అనీ, చంద్రుడు జ్ఞానమునకు అధిపతి కాబట్టి, ఇందువులు అంటే జ్ఞానులు లేదా దైవ జ్ఞాన మార్గములో నడిచేవారు అని వీరి అభిప్రాయం. ఇందూజ్ఞానము అంటే దైవజ్ఞానము అని వీరు చెప్పుకొనే అర్థము.

ఇందూ జ్ఞాన వేదిక ప్రచురించిన పుస్తకం ముఖచిత్రంగా ఇందూ జ్ఞానవేదిక స్థాపించిన ప్రబోదానంద యోగీశ్వరులు

సిద్ధాంతాలు

మార్చు

విశ్వవ్యాప్తంగా అన్ని మతాలలోనూ త్రైత సిద్ధాంతం ప్రవచించే ఇందూపథం అంతర్లీనంగా ఉందని, మత సామరస్యం సమాజపురోగతికి అవసరమనీ బోధిస్తుంది. సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఏ మతము, కులము లేదనీ వీరు చెప్తారు. ఇందు అన్నది ఒక పథము కానీ, మతము కాదని వీరి అభిప్రాయం. వీరి సిద్ధాంతాల ప్రకారం మతానికి అతీతమైనది ఇందూ పథము. పూర్వం భారతదేశాన్నీ ఇందూదేశము అనేవారనీ కాలక్రమేణ అది వందల సంవత్సరాల క్రితం మాత్రమే, హిందూ దేశంగా మారినది అనీ వీరి వాదన. కుల, మత విశ్వాసాలకు అతీతమైనది వీరి ఇందూ పథం (మార్గం). దీనిని అనుసరించేవారిన ఇందువులని పిలుస్తూంటారు. వీరి ప్రకారం వాస్తుకు శాస్త్ర ప్రామాణికత లేదు. యజ్ఞయాగాలు, వ్రతాలు, వేదాధ్యయనాలు దైవసమ్మతం కాదని వీరి సిద్ధాంతం. వీరి సిద్ధాంతంలో చెప్పబడే ఇంద్రియాతీత ఆత్మ జ్ఞానానికి మంత్ర, జప, ఉపవాస, ధ్యానాదులు అవసరం లేదని భావిస్తారు. ఆచారాలు, సంప్రదాయాలకు ఈ సిద్ధాంతంలో అంతరార్థాలు, ఆత్మజ్ఞాన బద్ధంగా చెప్తారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లకు భాష్యం చెప్తూ, వాటిని ఆయా మతాల ప్రధాన స్రవంతి సిద్ధాంతాల్లోనూ, మతాచార్యులూ వ్యాఖ్యానించే తీరుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తారు. ఇందూపద్ధతిని ప్రచారం చేసి ప్రపంచం అంతా దాని కిందికి తీసుకురావడం ద్వారా వసుధైక కుటుంబం సాధించవచ్చని వీరి భాష్యం. మంత్రాలు-మహత్యాలు, దయ్యాలు-భూతాలు, దేవుడు-దేవతలు-భగవంతుడు, జననము-మరణము, పునర్జన్మ-మోక్షం నమ్మకాలు-మూఢనమ్మకాలు ఇత్యాది విషయాలపై వీరికి తమవైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిందు, ఇస్లాం, క్రైస్తవాల్లోని భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాత్రమే వీరు అంగీకరిస్తరు, వేదాలు, పురాణాలు, పాత నిబంధన, హదీసులు వంటివాటిని వీరు తిరస్కరిస్తారు. భగవద్గీత శ్లోకాలలో, 4 సువార్తల వచనాలలో, ఖురాన్ ఆయతులలో మాత్రమే ఆత్మజ్ఞానం ఉందని వీరు పేర్కొంటారు. వీరు శిలువను మాయగా, క్రీస్తును భగవంతునిగా చెప్తారు. వీరు హిందూ దేవతల్లో కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి, రాముడు భగవంతుడు కాడని చెప్తూంటారు. మానవులకు బ్రహ్మవిద్య తెలిపేందుకు భగవంతుడే త్రేతాయుగంలో రావణుడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో ఏసుక్రీస్తు రూపాల్లో జన్మించాడని వీరి విశ్వాసం. తెలుగు భాష వల్లనే ఆత్మజ్ఞానం చెప్పేందుకు, తెలుసుకునేందుకు వీలుందని, తెలుగు దైవభాష అనీ ఈ సిద్ధాంతకర్త ప్రబోధానంద చెప్తాడు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రానున్న భవిష్యత్తులో అందరూ తెలుగు నేర్చకుంటారని అతని సిద్ధాంతం. ఇలా నిత్యజీవితానికి సంబంధించిన మరెన్నో విషయాలపై, ఆధ్యాత్మికాంశాలపై తమదైన వ్యాఖ్యానం వీరు చేస్తారు. ఈ సిద్ధాంతాలు ప్రధానంగా ప్రబోధానంద ప్రతిపాదించి పలు పుస్తకాల్లో రాస్తూ, ప్రసంగాల ద్వారా ప్రచారం చేశాడు.

ఆచార వ్యవహారాలు

మార్చు

త్రైత సిద్ధాంతాన్ని అంగీకరించేవారిని త్రైతులనీ, ఇందూజ్ఞానమన్న పేరిట ఇందువులనీ పిలుచుకుంటూంటారు.

వీరు ప్రచురించిన తెలుగు పుస్తకాలు

మార్చు
  1. త్రైత సిద్ధాంత భగవద్గీత
  2. ఆధ్యాత్మిక ప్రశ్నలు-జవాబులు
  3. ధర్మము-అధర్మము
  4. ఇందుత్వమును కాపాడుదాం
  5. యజ్ఞములు (నిజమా-అబద్ధమా)
  6. దయ్యాలు - భూతాల యథార్థసంఘటనలు
  7. సత్యాన్వేషి కథ
  8. మంత్రము-మహిమ (నిజమా-అబద్ధమా)
  9. శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా
  10. గీతా పరిచయము
  11. కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు)
  12. జనన మరణ సిద్ధాంతము
  13. మరణ రహస్యము
  14. పునర్జన్మ రహస్యము
  15. త్రైతాకార రహస్యము
  16. జ్యోతిష్య శాస్త్రము
  17. కథల జ్ఞానము
  18. సామెతల జ్ఞానము
  19. పొడుపు కథల జ్ఞానము
  20. తత్వముల జ్ఞానము
  21. తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము
  22. గీతం - గీత
  23. దేవాలయ రహస్యములు
  24. ఇందూ సంప్రదాయములు
  25. మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?)
  26. తల్లి - తండ్రి
  27. గురు ప్రార్థనా మంజరి
  28. త్రైతారాధన
  29. సమాధి
  30. ప్రబోధ
  31. సుబోధ
  32. సిలువ దేవుడా ?
  33. మతాతీత దేవుని మార్గము
  34. దేవుని గుర్తు 963 - మాయ గుర్తు 666
  35. మతము-పథము
  36. ప్రబోధానందం నాటికలు
  37. ఇందువు క్రైస్తవుడా ? (ఇది మత మార్పిడి మీద బ్రహ్మాస్త్రం)
  38. నిగూఢ తత్వార్ధ బోధిని
  39. ఆత్మ లింగార్థము
  40. నాస్తికులు -ఆస్తికులు
  41. హేతువాదము-ప్రతివాదము
  42. గుత్తా
  43. ప్రబోధ తరంగాలు
  44. త్రైత సిద్ధాంతము
  45. ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత
  46. అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు
  47. ద్రావిడ బ్రాహ్మణ
  48. తీర్పు
  49. కర్మ పత్రము
  50. ప్రవక్తలు ఎవరు ?
  51. ధర్మశాస్త్రము ఏది?
  52. మతమార్పిడి దైవ ద్రోహము-మహా పాపము
  53. త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక ఘంటు
  54. స్వర్గము ఇంద్రలోకమా! నరకము యమరాజ్యమా!!
  55. జీహాద్ అంటే యుద్ధమా?
  56. మూడు గ్రంథములు ఇద్దరు గురువులు ఒక బోధకుడు
  57. దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది
  58. అజ్ఞానములో ఉగ్రవాద బీజాలు
  59. వార్తకుడు-వర్తకుడు
  60. దేవుని చిహ్నము
  61. ఏది నిజమైన జ్ఞానము?
  62. ప్రతిమ ✖ విగ్రహ; దైవము ✖ దయ్యము
  63. మరణము తర్వాత జీవితము
  64. ఏ మతములో ఎంత మతద్వేషము?
  65. హిందూ మతములో సిద్ధాంత కర్తలు
  66. నీకు నా లేఖ
  67. ఒక మాట మూడు గ్రంథములు
  68. లు అంటే ఏమిటి ?
  69. ఆదిత్య
  70. చెట్టు ముందా! విత్తు ముందా?
  71. ఒక్కడే ఇద్దరు
  72. ఏసు చనిపోయాడా? చంపబడ్డాడా?
  73. సాయిబాబా దేవుడా! కాదా?
  74. దేవుని రాకకు ఇది సమయము కాదా?
  75. విశ్వ విద్యాలయము
  76. కృష్ణ మూస
  77. గీటు రాయి
  78. మూడు దైవ గ్రంథములు మూడు ప్రథమ వాక్యములు
  79. హేతువాద ప్రశ్నలు - సత్యవాద జవాబులు
  80. భావము - భాష
  81. దైవ గ్రంథములో సత్యాసత్య విచక్షణ
  82. ప్రసిద్ధి బోధ
  83. నాది లోచన - నీది ఆలోచన
  84. దేవుని ముద్ర
  85. ధర్మచక్రము
  86. హిందూ మతములో కుల వివక్ష
  87. ధ్యానము ప్రార్థన నమాజ్
  88. ప్రాథమిక జ్ఞానము (హిందూ మతములో ఆధిపత్య క్రియ)
  89. అంతిమ దైవగ్రంథములో వజ్ర వాక్యములు
  90. ఏది సత్యము - ఏది అసత్యము
  91. ఒక వ్యక్తి రెండు కోణములు
  92. బ్రహ్మ - రావణబ్రహ్మ - భగవాన్ రావణబ్రహ్మ
  93. ద్వితీయ దైవ గ్రంథములో రత్న వాక్యములు
  94. హిందూ ధర్మమునకు రక్షణ అవసరమా?
  95. వేదములు మనిషికి అవసరమా?
  96. ఉపనిషత్తులలో లోపాలు
  97. ఖుర్ఆన్-హదీసు ఏది ముఖ్యము
  98. సుప్రసిద్ధి బోధ
  99. భక్తిలో మీరు సంసారులా? వ్యభిచారులా?
  100. శతము ౧౦౦

వీరు వెలువరించిన తెలుగు ఆధ్యాత్మిక ప్రసంగాలు

మార్చు
  1. ఆత్మకు వెంట్రుక గుర్తు
  2. సంతకము
  3. సాంప్రదాయము
  4. కోడిపుంజు - పాదరసము
  5. త్రైతశకము
  6. నైజం - సహజం
  7. పైత్యం - సైత్యం
  8. శైవము - వైష్ణవము
  9. యాదవ్
  10. బట్టతల
  11. కాయ - పండు - కాయ
  12. జ్ఞానము - విజ్ఞానము
  13. వార - మాస - వత్సర
  14. యుగము – యోగము
  15. సేకూవలి - కూలిసేవా
  16. వెలుగుబంటు
  17. మాట - మందు
  18. ఏకత - ఏకాగ్రత
  19. ధర్మమ - అధర్మము
  20. సృష్ఠి - సృష్ఠికర్త
  21. గురువులేని విద్య గ్రుడ్డి విద్య
  22. భగవంతుడు
  23. ద్రావిడులు - ఆర్యులు
  24. మేఘం ఒక భూతం- రోగం ఒక భూతం
  25. ప్రభువు - ప్రభుత్వం
  26. భూతం - మహాభూతం
  27. ప్రభు - ప్రజ
  28. ఇందూ మహాసముద్రము
  29. పుస్తకము - గ్రంథము
  30. ఎదమీదముద్ర - తల్లి తండ్రి గుర్తు
  31. ఏక్ నిరంజన్ - అలక్ నిరంజన్
  32. ప్రకృతి - వికృతి
  33. ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు
  34. హరికాలు - హరచేయి
  35. పుట్టగోసి - మొలత్రాడు
  36. చమత్కార ఆత్మ
  37. 1 2 3 గురుపౌర్ణమి
  38. కర్మ లేని కృష్ణుడు - కర్మ ఉన్న కృష్ణుడు
  39. క్షమించరాని పాపము
  40. మాయకుడు - అమాయకుడు
  41. ఇచ్ఛాధీన కార్యములు - అనిచ్ఛాధీన కార్యములు
  42. బయటి సమాజము - లోపలి సమాజము
  43. సహజ మరణం - తాత్కాలిక మరణం
  44. మరణము - శరీరము
  45. ప్రపంచ శ్రద్ధ - పరమాత్మ శ్రద్ధ
  46. యోగీశ్వరుల జన్మదిన సందేశము
  47. సేవా శాతము
  48. దేవుని జ్ఞానము - మాయ మహత్యము
  49. టక్కుటమారా, ఇంద్రజాల మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ
  50. ద్వితీయుడు - అద్వితీయుడు
  51. శ్రీ కృష్ణాష్టమి
  52. సమాధి
  53. తల్లి - తండ్రి
  54. తల్లి తండ్రి - గురువు దైవము
  55. పథము - మతము
  56. తల్లి
  57. కలియుగము
  58. దివ్యఖురాన్ - హదీస్
  59. గోరు - గురు
  60. పుట్టుట - గిట్టుట
  61. కర్మ మర్మము
  62. ఆత్మ
  63. తాత
  64. గురుపౌర్ణమి
  65. ఇందువు ✖ హిందువు
  66. శ్రీ కృష్ణ జన్మ మధుర
  67. ఆత్మపని
  68. త్రైతసిద్ధాంతము
  69. స్త్రీ-పు / లింగము
  70. దేశం మోసం - దేహం మోహం
  71. జీర్ణ + ఆశయము
  72. దేవునికి మతమున్నదా?
  73. ఏది ధర్మము?
  74. అధర్మ ఆరాధనలు
  75. మూడు పుట్టుకలు - రెండు జన్మలు
  76. పుట్టిన రోజు ఎవ్వరికీ రాదు
  77. నిదర్శ - నిరూప
  78. నటించే ఆత్మ
  79. సంచిత కర్మ
  80. గురువు ఎవరు?
  81. శ్రీ కృష్ణుడు ఎవరు?
  82. భయం
  83. సుఖము - ఆనందము
  84. దశ - దిశలు
  85. ఆడించే ఆత్మ
  86. స్వార్థ రాజకీయం
  87. మూడు నిర్మాణాలు - ఒక పరిశుభ్రత
  88. ఏది శాస్త్రము?
  89. తెలుగులో 3 6 9 (౩ ౬ ౯)
  90. 6-3=6
  91. గుర్తింపబడనివాడు గురువు
  92. జ్ఞానము దగ్గర జాగ్రత్త!
  93. చంద్రాకారము (బట్టతల)
  94. మతములలో పవిత్రయుద్ధం
  95. మూడు గ్రంథములు
  96. ఏడు ఆకాశములు
  97. దైవ గ్రంథము
  98. జ్ఞానము కబ్జా అయ్యింది
  99. భక్తి - భయము
  100. జ్ఞాన శక్తి
  101. ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు
  102. కాల జ్ఞాన వాక్యములు
  103. అర్థము - అపార్థము
  104. తోలేవాడు
  105. గురు చిహ్నం
  106. భక్తి - శ్రద్ధలు
  107. దేవుడు ఇద్దరా! ఒక్కరా!!
  108. పురుషోత్తమ
  109. మత ద్వేషము
  110. నీ వెనుక వాడు
  111. గ్రంథము - బోధ
  112. ఆట - దోబూచులాట
  113. ప్రజలు - మానవులు
  114. ఆస్తి - దోస్తి
  115. దంతము - అంతము
  116. మాయ మర్మము - ఆత్మ ధర్మము
  117. శ్రీ కృష్ణుడు చనిపోయాడా? చంపబడ్డాడా?
  118. అంతిమ గ్రంథములో ప్రథమ వాక్యములు
  119. అదురు-బెదురు
  120. శవము-శివము
  121. ధర్మచక్రము
  122. గ్రాహిత శక్తి
  123. భౌతికము-అభౌతికము
  124. దేవుని ఆజ్ఞ మరణము
  125. మత సామరస్యం
  126. మోక్షము - మోసము
  127. అక్షర జ్ఞానము
  128. లలా జలము
  129. దైవ ధర్మములు - మత సాంప్రదాయములు
  130. ఆహారము నీకా! నీ ఆత్మకా!!
  131. అక్షయపాత్ర
  132. మాత్ర-మందు
  133. కాల చక్రం
  134. బ్రహ్మ విద్య
  135. శక్తి
  136. పౌర్ణమి-అమావాస్య
  137. ఈశ్వర-పరమేశ్వర
  138. పురుషోత్తమ-శ్రీరామ
  139. దేవునికి ఒక్కడే కుమారుడు - దేవునికి అనేకమంది కుమారులు
  140. జలం
  141. అధికారి
  142. గ్రహాంతరవాసులు
  143. దేవుడు ద్వితీయుడా? అద్వితీయుడా?
  144. మనిషి చేతిలో భగవంతుదు - దేవుని చేతిలో మనిషి
  145. శరీరములో రక్తము - గ్రంథములో జ్ఞానము
  146. గ్రంథము లో జ్ఞానము - మనిషి లో రక్తము
  147. త్రైత సిద్ధాంత చరిత్ర
  148. కుషాల్ కుషాల్ లంజమ్మ నా నెత్తిమీద రెండు తన్నమ్మ



బయటి లింకులు

మార్చు