కెల్విన్

(Kelvin నుండి దారిమార్పు చెందింది)

కెల్విన్ (Kelvin (symbol: K) ఉష్ణోగ్రత యొక్క కొలమానము, ఏడు మూల SI మెట్రిక్ పద్ధతి ప్రమాణాలలో ఒకటి. కెల్విన్ కొలమానంలో ఉష్ణగతిశాస్త్రం ప్రకారం శూన్యం (అనగా 0 K) వద్ద ఉష్ణ శక్తి లేకపోవడం. కెల్విన్ అనేది ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీరు అయిన విలియం థాంసన్, మొదటి బేరన్ కెల్విన్ (William Thomson, 1st Baron Kelvin (1824–1907) ) పేరు మీద నామకరణం చేయబడింది. ఇతడు పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) కనుగొనేందుకు ప్రయత్నించాడు. కెల్విన్‌ కొలమానంలో - ఉదాహరణకి, పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం 0 K అని రాస్తారు తప్ప 0°K అని రాయకూడదు. అనగా కెల్విన్ కొలమానం వాడేటప్పుడు డిగ్రీలని సూచించే చిన్న సున్నని రాయనక్కర లేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఉన్న ఆచారం.

సెల్సియస్, కెల్విన్ మానంలో ఉష్ణమాపకం

1) కిలోగ్రాము, కెల్విన్, మోల్, ఆంపియర్ యూనిట్ల కొలతల్లో మార్పులకు భారత్ అంగీకరించింది. ఈ మార్పులను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?

  • జ: 2019 వాతావరణ శాస్త్రం దినమైన మే 20 నుంచి*

2) ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగింటికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ 2018 నవంబరు 16న ఎక్కడ జరిగిన సమావేశంలో తీర్మానం చేశాయి ?

  • జ: పారిస్ లో*

3) ప్రామాణిక కొలతలకు సంబంధించి మెట్రిక్ వ్యవస్థను వందకు పైగా దేశాలు ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాయి ?

  • జ: 1889 నుంచి*
"https://te.wikipedia.org/w/index.php?title=కెల్విన్&oldid=3877703" నుండి వెలికితీశారు