లండన్

ఇంగ్లండ్ రాజధాని మరియు యునైటెడ్ కింగ్డమ్
(London నుండి దారిమార్పు చెందింది)

లండన్ (London) మహానగరం యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రాజధాని, ఇంగ్లాండ్ లోనే అతి పెద్ద నగరం. ఇప్పటి లండన్, పురాతన లండన్, దాని చుట్టూ ఏర్పడ్డ నగరాల సముదాయం.

Tower Bridge London Feb 2006.jpg

రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది.[1]రాజకీయంగా, వైజ్ఞానికంగా, విద్య, వినోదం, కళలు, ఫ్యాషన్,, ప్రసార మాధ్యమాల్లో ప్రపంచ దేశాలపై దీని ప్రభావం వల్ల ప్రపంచంలో ఒక మహానగరంగా విరాజిల్లుతోంది. ఇది ప్రపంచంలో కెల్లా విస్తీర్ణములో అతి పెద్ద నగరం.

7.5 మిలియన్ల జనాభాతో యూరోప్ యూనియన్లోనే అత్యధిక జనాభాగల నగరంగా గుర్తించబడింది. మెట్రోపాలిటన్ జనాభా సుమారు 12 నుంచి 14 మిలియన్లు. నగరంలో నివసించే ప్రజలు వివిధ జాతుల, మతాల, సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి పౌరులు దాదాపు 300 భాషలు మాట్లాడుతారు.

ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఒక నౌకాయన కేంద్రంతో ఇది ప్రధాన అంతర్జాతీయ రవాణాకేంద్రం కూడా. అంతేకాక అతి పెద్ద పౌర విమానయాన కేంద్రం కూడా. లండన్ లోని హీత్రూ విమానాశ్రయం అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను చేరవేసే కేంద్రం.

A panorama of modern London, taken from the Golden Gallery of Saint Paul’s Cathedral
A panorama of modern London, taken from the Golden Gallery of Saint Paul’s Cathedral

మూలాలుసవరించు

  1. ^ Z/Yen Limited (November 2005). The Competitive Position of London as a Global Financial Centre (PDF). CityOfLondon.gov.uk. Retrieved on 2006-09-17.
"https://te.wikipedia.org/w/index.php?title=లండన్&oldid=3174742" నుండి వెలికితీశారు