రేఖాంశం

భూమి ఉపరితలంపై తూర్పు-పడమర లో ఒక బిందువు స్థానమ పేర్కొనే భౌగోళిక సమన్వయం.
(Longitude నుండి దారిమార్పు చెందింది)

భూగోళం మీద అడ్డంగా, నిలువుగా ఉండే కొన్ని రేఖలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. వీటిలో అడ్డంగా ఉండే ఊహారేఖలను అక్షాంశాలు అనీ, నిలువుగా ఉండే ఊహారేఖలను రేఖాంశాలు అనీ వ్యవహరిస్తారు[1]. వీటిని డిగ్రీలలో లెక్కిస్తారు.[2] ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు రేఖాంశంతో పాటు, అక్షాంశం కూడా తెలియాలి.

  • - ఇవి అర్థ వృత్తాలు.
  • - ఈ అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
  • - భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
  • - ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అని కూడా అంటారు.
  • - 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. ఇదే ప్రధాన రేఖాంశం అంటారు.
  • - గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 180 డిగ్రీల రేఖాంశంగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
  • - 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు 180డిగ్రీల వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
  • - 0 డిగ్రీల రేఖాంశం నుండి పడమర 180డిగ్రీల వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
  • - భూమి 1డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
  • - రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
  • - రేఖాంశాలు భూమధ్యరేఖ ఎక్కువ వెడల్పుతో ఉంటాయి.
  • -ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
  • - 15 డిగ్రీలకు ఒక కాలమండలం చొప్పున ప్రపంచాన్ని 360 రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
  • - రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
  • - లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
  • - ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
  • - రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
అక్షాంశ రేఖాంశాలు

మూలాలు

మార్చు
  1. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "అక్షాంశాలు - రేఖాంశాలు". pratibha.eenadu.net. Retrieved 2021-07-29.
  2. B.Subbarayan (1990). Balala Vijnana Sarvasvamu-Samskruthi Vibhagamu (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రేఖాంశం&oldid=3588298" నుండి వెలికితీశారు