సత్తుపల్లి

(Sathupalli నుండి దారిమార్పు చెందింది)

సత్తుపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం.[2] చిన్న పట్టణం.అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]

సత్తుపల్లి
నగర పంచాయితీ కార్యాలయం
నగర పంచాయితీ కార్యాలయం
సత్తుపల్లి is located in Telangana
సత్తుపల్లి
సత్తుపల్లి
తెలంగాణ పటంలో పట్టణ స్థానం
Coordinates: 17°12′30″N 80°50′10″E / 17.20833°N 80.83611°E / 17.20833; 80.83611
Country India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఖమ్మం
విస్తీర్ణం
 • Total19.13 కి.మీ2 (7.39 చ. మై)
జనాభా
 (2011)
 • Total31,857
 • జనసాంద్రత1,700/కి.మీ2 (4,300/చ. మై.)
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
507303
టెలిఫోన్ కోడ్08761
Vehicle registrationTS-04

శాసనసభ నియోజకవర్గం

మార్చు

సత్తుపల్లి పురపాలక సంఘం

మార్చు

విశేషాలు

మార్చు
  • ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.
  • ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
  • ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
  • సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
  • శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.

ఆరోగ్యం

మార్చు

1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 30 పడకల సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పూర్తయిన ఆసుపత్రిని ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం 2020లో 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించింది.[4] అయితే ఆసుపత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి, వర్షానికి కురుస్తూ రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతండడంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 34 కోట్ల రూపాయల (రూ. 29 కోట్లు నూతన భవన నిర్మాణానికి, రూ. 5 కోట్లు ఆధునిక పరికరాల కొనుగోలు) నిధులు మంజూరు చేసింది. 2022, జనవరి 29న రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు నూతన ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. "District Census Handbook – Khammam" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. p. 14,46. Retrieved 1 June 2016.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2018-01-12.
  3. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  4. "సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-28. Archived from the original on 2022-01-29. Retrieved 2022-01-31.
  5. "సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ: మంత్రి హరీశ్‌రావు". EENADU. Archived from the original on 2022-01-30. Retrieved 2022-01-31.
  6. "సర్కారు వైద్యంపై..సీఎం ప్రత్యేక దృష్టి". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-29. Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31.

వెలుపలి లింకులు

మార్చు
  • [1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ.