సెకండు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సెకను అనగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణికాలలో (SI) సమయం యొక్క మూల ప్రమాణం, ఇతర కొలత వ్యవస్థలలో సమయ ప్రమాణం కూడా, గంట సమయాన్ని 60 ద్వారా భాగిస్తే వచ్చే సమయాన్ని నిమిషము అంటారు, మళ్ళీ నిమిషాన్ని 60 తో భాగించగా వచ్చే సమయాన్ని సెకను అంటారు. సెకన్ను ఆంగ్లంలో సెకండ్ (second) అంటారు. సెకను చిహ్నం: s, సంక్షిప్తంగా s లేదా sec తో సూచిస్తారు. సెకన్లను యాంత్రిక, విద్యుత్ లేదా అటామిక్ గడియారములను ఉపయోగించి లెక్కిస్తారు.
సెకను యొక్క ఉపవిభాగాలను సూచించడానికి సెకను పదంతో అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణిక పూర్వపదాలను (SI prefixes) తరచుగా కలుపుతారు. ఉదాహరణకు మిల్లీసెకను (సెకను యొక్క వెయ్యివ భాగము), మైక్రోసెకను (సెకను యొక్క పదిలక్షో వంతు), నానోసెకను (సెకను యొక్క వందకోట్లో వంతు).
అలాగే SI పూర్వపదాలు సెకను యొక్క గుణిజాలు ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కిలోసెకను (వెయ్యి సెకన్లు) వంటివి, అయితే ఇటువంటి యూనిట్లు ఆచరణలో చాలా అరుదుగా ఉపయోగిస్తారు.
సాధారణంగా సమయం యొక్క ప్రమాణాలు SI ప్రమాణాలు సూచించే పది యొక్క శక్తులుగా ఏర్పడి ఉండవు, దానికి బదులుగా సెకండ్ ను 60 చే గుణించగా నిమిషము రూపము, దీనిని 60 చే గుణించగా ఒక గంట, దీనిని 24 చే గుణించగా ఒక రోజు అవుతుంది.
లిప్తపాటు కాలాన్ని క్షణము అంటారు. ఐదు క్షణాలు ఒక సెకను.
ఇతర కాలమానలతో సమానమైన పోలిక
మార్చుఒక అంతర్జాతీయ సెకను ఈ క్రింది వానికి సమానం :
SI గుణిజాలు
మార్చుSI పూర్వపదాలను సాధారణంగా సెకను కంటే తక్కువ సమయాన్ని కొలిచేందుకు, అరుదుగా సెకను యొక్క గుణిజాలుగా (దీనిని మెట్రిక్ సమయం అని పిలుస్తారు) ఉపయోగిస్తారు. దీనికి బదులుగా non-SI units నిమిషాలు, గంటలు, రోజులు, జూలియన్ సంవత్సరాలు, జూలియన్ శతాబ్దాలు, జూలియన్ సహస్రాబ్దాలుగా ఉపయోగిస్తారు.
Submultiples | Multiples | |||||
---|---|---|---|---|---|---|
Value | Symbol | Name | Value | Symbol | Name | |
10−1 s | ds | decisecond | 101 s | das | decasecond | |
10−2 s | cs | centisecond | 102 s | hs | hectosecond | |
10−3 s | ms | millisecond | 103 s | ks | kilosecond | |
10−6 s | µs | microsecond | 106 s | Ms | megasecond | |
10−9 s | ns | nanosecond | 109 s | Gs | gigasecond | |
10−12 s | ps | picosecond | 1012 s | Ts | terasecond | |
10−15 s | fs | femtosecond | 1015 s | Ps | petasecond | |
10−18 s | as | attosecond | 1018 s | Es | exasecond | |
10−21 s | zs | zeptosecond | 1021 s | Zs | zettasecond | |
10−24 s | ys | yoctosecond | 1024 s | Ys | yottasecond | |
Common prefixes are in bold |