WX లిప్యంతరీకరణ

WX లిప్యంతరీకరణ పద్ధతి భారతీయ భాషలను రోమన్ లిపిలో రాయటానకి వాడతారు. ఈ పద్ధతి ఐఐటి కాన్పూర్ లో మొదలైంది.[1]  ఇది  సహజ భాష గణన ప్రక్రియలో వాడతారు.  దీని ప్రధాన లక్షణాలేమంటే

ప్రతి ఒక్క అచ్చు, హల్లు ఒకే ఒక విధమైన రోమన్ లిపితో జతచేయబడింది. దీనిని ఆదికలుపు కోడ్ (prefix code) కావున గణన ప్రక్రియలో ఉపయోగంగా వుంటుంది. సాధారణంగా హ్రస్వ అచ్చులకు, సాధారణ హల్లులకు  చిన్న రోమన్ అక్షరాలు, దీర్ఘ అచ్చులకు, వత్తి పలికే హల్లులకు  పెద్ద రోమన్ అక్షరాలు వాడతారు. సాధారణ ట వర్గానికి  సంబంధిత రోమన్ అక్షరాలు, త వర్గానికి w W x X వాడతారు కావున WX పద్ధతి అంటారు.

దీనిని కృత్రిమ తెలుగు భాష ఉచ్ఛారణ పరిశోధనలో వాడతారు. [2]

అచ్చులుసవరించు

a A i I u U e E o O

సఘోషాలు (Sonorants)సవరించు

q Q L

అనుస్వర, విసర్గసవరించు

अं अः
M H

అనునాశిక 'z' తో సూచిస్తారు. ఉదాహరణకు अँ = az.

హల్లులుసవరించు

क् ख् ग् घ् ङ् కంఠము
k K g G f
च् छ् ज् झ् ञ् తాలువు
c C j J F
ट् ठ् ड् ढ् ण् మూర్ధము
t T d D N
त् थ् द् ध् न् దంతము
w W x X n
प् फ् ब् भ् म् ఓష్ఠము
p P b B m
य् र् ल् व् లఘువు, అలఘువు
y r l v
श् ष् स् ह् ఊష్మము
S R s h


ఈ పద్ధతి అని భారతీయ భాషలకు పొడిగించబడింది. మూడు ప్రత్యేక గుర్తులు అనగా  Yతో ISCII లోని తరువాత  అక్షరము, V తో క్రిందటి అక్షరం , Zతో నుక్త వాడతారు. ఉదాహరణగా 'l' దేవనాగరి లో ని ल (U0932) కాగా, 'lY' తో మరాఠీ లో ని ळ (U0933), 'e' దేవనాగరి లో ని ए (U090F) లేక తెలుగులో  ఏ (U0C0F)  కాగా, eV అంటే దేవనాగరిలో ऎ (U090E), తెలుగులో ఎ (U0C0E). అలాగే ka అనగా  దేవనాగరిలో  क, 'kZa' అనగా దేవనాగరిలో क़.

మూలాల జాబితాసవరించు

  1. Akshar Bharati; Vineet Chaitanya; Rajeev Sangal (1996). "Appendix B". Natural Language Processing: A Paninian Perspective (PDF). Prentice-Hall of India. pp. 191–193. ISBN 9788120309210. Archived from the original (PDF) on 26 నవంబరు 2013. Retrieved 16 February 2014.
  2. SUNITHA, K.V.N.; DEVI, P.Sunitha (2010). "BHAASHIKA: TELUGU TTS SYSTEM". BHAASHIKA: TELUGU TTS SYSTEM. International Journal of Engineering Science and Technology. 2. Retrieved 7 May 2018.

బయటిలింకులుసవరించు