షాయిరి ఉర్దూ, పంజాబీ, హిందీ భాషలలో 'షాయిరి' లేక కవిత్వం ప్రధానంగా షేర్ లేక రెండు పంక్తుల కవితలపై ఆధారపడి వుంటుంది. షేర్ కు బహువచనము 'అషార్'. నజమ్ లేక గజల్ అషార్ లపై ఆధారపడివుంటుంది, ప్రతి షేర్ సంపూర్ణమయిన సారాంశాన్ని కలిగి వుంటుంది. నజమ్ లోని ప్రతి షేర్ ఒకే అంశంపై వర్ణింపబడివుంటుంది. గజల్ లో ప్రతి షేర్ స్వంతసారాంశాన్ని గలిగివుంటుంది.

షేర్ మార్చు

చూడుము షేర్

బైత్ మార్చు

షేర్ కు ఇంకొక నామము 'బైత్', షేర్-ఒ-షాయిరికి మరో పేరు బైత్-బాజి

బైతుల్ గజల్ మార్చు

గజల్ లోని ఉన్నత ప్రామాణికాలు గల షేర్ ను 'బైతుల్ గజల్' అంటారు.

గజల్ మార్చు

చూడుము గజల్

ఫర్ద్ మార్చు

షాయిరీలో కేవలం ఒకే 'షేర్' ను రచిస్తే దాన్ని 'ఫర్ద్' అని అంటారు.

హమ్ద్ మార్చు

చూడుము హమ్ద్

హజల్ మార్చు

హాస్యభరితమయిన కవితను 'హజల్' అని అంటారు.

హిజ్వ్ మార్చు

ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్రాయబడ్డ కవిత 'హిజ్వ్'. చక్కగా చెప్పాలంటే 'మద్దాహ్' కు వ్యతిరేకం ఈ 'హిజ్వ్'. నిజంచెప్పాలంటే హిజ్వ్ వ్రాసే కవులు బహు అరుదు.

హుస్న్-ఎ-మత్లా మార్చు

ఒక గజల్ లో ఒక మత్లా తరువాత ఇంకో మత్లా రచిస్తే, ఈ రెండవ మత్లాను 'హుస్న్-ఎ-మత్లా' అంటారు..

మద్దాహ్ మార్చు

రాజులు, పోషకులు గూర్చి శ్లాఘిస్తూ వ్రాసే కవితలను 'మద్దాహ్' అని అంటారు.

మన్ ఖబత్ మార్చు

మహమ్మదు ప్రవక్త గారి వంశం, వారి సంతానాన్ని లేదా ఔలియాలను స్తుతిస్తూ, పొగుడ్తూ వ్రాయబడ్డ కవిత.

 
ముహమ్మద్ ప్రవక్త సమాధి కల మస్జిదె నబవి

మఖ్ తా మార్చు

చూడుము మఖ్ తా

మర్సియా మార్చు

చూడుము మర్సియా

మస్నవి మార్చు

చూడుము మస్నవి

మత్లా మార్చు

గజల్ లోని మొదటి షేర్ను 'మత్లా' అని అంటారు.

మిస్రా మార్చు

షేర్ లోని ఒక పంక్తిని 'మిస్రా' అని అంటారు.

చూడుము మిస్రా

మునాజాత్ మార్చు

ఈశ్వరున్ని (అల్లాహ్) ను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ పాడే కవిత (లు) . ముఖ్యంగా ఇవి 'ప్రార్థనలు'.

ముసద్దస్ మార్చు

ఆరు మిస్రాలు గల కవితలను 'ముసద్దస్' అంటారు. ముసద్దస్ వ్రాయడంలో అల్తాఫ్ హుసేన్ హాలి ప్రసిధ్ధుడు.

నాత్ మార్చు

చూడుము నాత్

నజమ్ మార్చు

సాహిత్యంలో నజమ్ అనగా పద్యం లేక కవిత. కవిత ఒక అంశంపై గాని ఒక ఆలోచనపై గాని రచింపబడి వుంటుంది.

ఖాఫియా మార్చు

చూడుము ఖాఫియా

ఖసీదా మార్చు

కీర్తిస్తూ రచింపబడ్డ కవితను 'ఖసీదా' అంటారు.

చూడుము ఖసీదా

ఖతా మార్చు

రెండు అషార్ ల కవితను ఖతా అని అంటారు.

రదీఫ్ మార్చు

చూడుము రదీఫ్

రుబాయి మార్చు

చూడుము రుబాయి

సలామ్ మార్చు

మహమ్మదు ప్రవక్త, హుసేన్ ఇబ్న్ అలీ, ఇతర ఔలియా లను శ్లాఘిస్తూ సమర్పించే వందనాన్ని సలామ్ అంటారు.

సెహ్రా మార్చు

వివాహ సందర్భాలలో చదివే గేయాలను, పాటలను, కవితలను సెహ్రా అని అంటారు.

షెహ్ర్-ఎ-ఆషూబ్ మార్చు

పాడుబడ్డ నగరం గురించి వ్రాసే కవితలను షెహ్ర్-ఎ-ఆషూబ్ అని అంటారు.

తహ్-తుల్-లఫ్జ్ మార్చు

కవితలను 'రాగయుక్తంగా' గాక 'సాదా' గా వినిపించడాన్ని 'తహ్-తుల్-లఫ్జ్' అని అంటారు.

తఖల్లుస్ మార్చు

కవులు తమ కవితలలో ఉపయోగించే 'కలం పేరు' లను తఖల్లుస్ అంటారు.

తరన్నుమ్ మార్చు

కవితను 'రాగయుక్తం' గా పాడడాన్ని 'తరన్నుమ్' అంటారు.

వాసోఖ్త్ మార్చు

బేజారు పడడాన్ని 'వాసోఖ్త్' అని అంటారు. విరక్తి చెంది వ్రాసే కవితలు, ప్రేమించినవారిపట్ల ఏహ్యతాభావాలు ఏర్పడినపుడు వ్రాసే కవితలను 'వాసోఖ్త్' అని అంటారు.

గీత్ మార్చు

పాట, గీతం లేక నేపథ్యం

ముషాయిరా మార్చు

కవిసమ్మేళనము. చూడుము ముషాయిరా

ఖవ్వాలీ మార్చు

ఖౌల్ అనే పదం నుండి ఉద్భవించిన పదం ఈ ఖవ్వాలి. ఖౌల్ అనగా సద్వచనం. సద్వచనాలు గల గీతాలాపనను ఖవ్వాలీ అంటారు. ఖవ్వాలీ గీతాలాపన చేసేవారిని ఖవ్వాల్ అని అంటారు. ఖవ్వాలీలలో సాధారణంగా హమ్ద్, నాత్, మన్ ఖబత్, గజల్లు వుంటాయి.