చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్

చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 45.90 కోట్ల రూపాయలతో 674 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది. శంషాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వైపు వెళ్ళేవారికి ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది.[1]

చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్
ప్రదేశం
చాంద్రాయణగుట్ట, హైదరాబాదు, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
శంషాబాదు - ఎల్బీనగర్
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్4
నిర్మాణం చేసినవారువినియోగంలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2022 ఆగస్టు 27
గరిష్ట
వెడల్పు
1110 మీటర్ల పొడవు
16.61 మీటర్ల వెడల్పు

నిర్మాణం మార్చు

అంతకుముందున్న ఉన్న 4 లైన్ల చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ నుండి 585 మీటర్ల నుండి 1110 మీటర్లు పొడిగించబడింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) కింద 2018లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించబడి కోవిడ్-ప్రేరిత లాక్‌డౌన్, వరదల కారణంగా నిర్మాణం ఆలస్యమైంది.[2] ఫ్లైఓవర్‌ కింద పచ్చదనం కోసం మొక్కలను, ఫిల్లర్ల నడుమ చక్కటి గార్డెనింగ్‌ను ఏర్పాటుచేశారు.[3]

ప్రారంభం మార్చు

2022 ఆగస్టు 27న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.[4]

మూలాలు మార్చు

  1. Telugu, TV9 (2022-08-22). "Hyderabad: ట్రాఫిక్‌ ఫ్రీ.. సిగ్నల్‌ ఫ్రీ సిటీ.. భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. మంగళవారం నుంచి అందుబాటులోకి చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవర్‌". TV9 Telugu. Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India, The Hans (2022-05-31). "Hyderabad: Chandrayangutta flyover to be ready by June-end". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
  3. "చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ ప్రారంభం వాయిదా.. కారణం ఇదేనా?". Sakshi. 2022-08-23. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-28.
  4. Namasthe Telangana (27 August 2022). "చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి మహమూద్‌ అలీ". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.