జటాయువు నేచర్ పార్క్

జటాయువు ఎర్త్స్ సెంటర్ లేదా జటాయువు నేచర్ పార్క్ అనేది

జటాయువు ఎర్త్ సెంటర్ లేదా జటాయువు నేచర్ పార్క్ అనేది కొల్లాం జిల్లాలోని చదయమంగళం జటాయుపర వద్ద ఉన్న పర్యావరణ ఉద్యానవనం, పర్యాటక కేంద్రం. ఈ పార్క్ మొత్తం వైశాల్యం 64 ఎకరాలు. దర్శకుడు రాజీవ్ అంచల్ దీనిని నిర్మించడానికి సహాయం చేసాడు. ఇది కేరళలోని మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ టూరిజం ప్రాజెక్ట్. ఇక్కడి జటాయువు విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి విగ్రహం.[1] ఈ పక్షి శిల్పం 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 75 అడుగుల ఎత్తు ఉంటుంది.[2] ఇతిహాసం ప్రకారం, రావణుడు, సీతను అపహరించి తీసుకపోయేటపుడు జటాయువు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. జటాయువు రావణుడితో పోరాడతాడు, కానీ జటాయువు చాలా వృద్ధుడు కావడంతో రావణుడు వెంటనే అతనిని ఓడించి రెక్కలను కత్తిరిస్తాడు, అప్పుడు జటాయువు చదయమంగళంలో రాళ్లపై పడిపోయాడు. రాముడు, లక్ష్మణులు సీత కోసం అన్వేషణలో ఉండగా, దెబ్బతిన్న జటాయువు , రావణుడితో యుద్ధం గురించి వాళ్ళకి తెలియజేసి, రావణుడు దక్షిణం వైపు వెళ్లాడని చెప్తాడు.

జటాయువు నేచర్ పార్క్, కొల్లాం
జటాయువు పార్క్
రకంపార్క్
స్థానంచదయమంగళం, కొల్లాం జిల్లా, భారతదేశం
సమీప పట్టణంకొల్లం జిల్లా
38 km (24 mi)
అక్షాంశరేఖాంశాలు8°51′57″N 76°52′02″E / 8.865888°N 76.867306°E / 8.865888; 76.867306
విస్తీర్ణం65 acres (26.30 ha)
నమూనా కర్తరాజీవ్ అంచల్
నిర్వహిస్తుందిజటాయుపర టూరిజం ప్రైవేట్ లిమిటెడ్
స్థితిఏడాది పొడవునా తెరిచి ఉంటుంది
బడ్జెట్100 crore (US$13 million)
ప్రజా రవాణా సౌకర్యంచదయమంగళంBus interchange - 1.5 km,
కొట్టారక్కర Bus interchange - 21.8 km,
వంకర్ల Mainline rail interchange - 26  km,
కొట్టారక్కర Mainline rail interchange - 20.5 km,
కొల్లం ferry/water interchange - 36 km,
త్రివేండ్రం Airport interchange - 52.3 km

పార్కు మార్చు

వంద కోట్లతో నిర్మిస్తున్న ఈ పార్కులో 6డి థియేటర్, పర్వతం పైకి వెళ్లేందుకు కేబుల్ కార్ సిస్టమ్, డిజిటల్ మ్యూజియం ఉన్నాయి.[3] అడ్వెంచర్ జోన్, ఆయుర్వేద రిసార్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు చెక్ డ్యాం నిర్మించారు. ఇక్కడ వర్షపు నీరు సేకరిస్తారు. [4] ఈ పార్కును 4 జూలై 2018న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ప్రారంభించాడు.  

శిల్పం మార్చు

భారీ శిల్పం లోపలకి పర్యాటకులు ప్రవేశించవచ్చు. రావణ-జటాయువు యుద్ధానికి సంబంధించిన 6డి థియేటర్ ప్రొడక్షన్ ఉంది.

 
జటాయు నేచర్ పార్క్ వద్ద రాతి ఫలకం

గ్యాలరీ మార్చు

జటాయువు పక్షి విగ్రహం

మూలాలు మార్చు

  1. "Jatayu sculpture: a perfect blend of myth, man's ingenuity and nature". OnManorama. Retrieved 2023-06-13.
  2. "Jatayu Earth's Center- world's largest bird sculpture". Jatayu Earth's Center. Retrieved 2023-06-13.
  3. "Jatayu Earth's Center, Chadayamangalam". Kerala Tourism. Retrieved 2023-06-13.
  4. "ആർക്കൈവ് പകർപ്പ്". Archived from the original on 2017-02-10. Retrieved 2017-02-21.