నవోదయ వారపత్రిక 1946 లో మద్రాసు నుండి ప్రారంభమైనది. ఈ పత్రికకు నీలంరాజు వేంకటశేషయ్య సంపాదకునిగా, ప్రచురణ కర్తగా వ్యవహరించాడు. బి.నాగిరెడ్డి ముద్రాపకుడిగా బి.ఎన్.కె.ప్రెస్ నుండి ఈ పత్రిక ప్రచురింపబడింది. రాజకీయ వార్తలతో పాటుగా ఈ పత్రిక సంగీతసాహిత్యాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఆంధ్రాభ్యుదయానికి పాటుపడే సచిత్ర వారపత్రిక అని తనను తాను అభివర్ణించుకుంది. ఈ పత్రికలో భోగరాజు పట్టాభిసీతారామయ్య, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, వేంకట పార్వతీశ్వరకవులు, టి.వి.సుబ్బారావు, గడియారం వేంకట శేషశాస్త్రి, ద్వారం వేంకటస్వామినాయుడు, పి.వి.రాజమన్నార్, జి.వి.కృష్ణారావు, విస్సా రామచంద్రరావు, జోశ్యుల సూర్యనారాయణమూర్తి, రజని, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శొంఠి కృష్ణమూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు, బొడ్డుపల్లి పురుషోత్తం, బుచ్చిబాబు, అడివి బాపిరాజు మొదలైన మహామహుల రచనలు వెలువడ్డాయి. ఈ పత్రిక 1947లో ప్రత్యేక పారిశ్రామిక సంచికను వెలువరించింది.

నవోదయ
నవోదయ
నవోదయ
నవోదయ
రకంవారపత్రిక
రూపం తీరుడెమీ ఆక్టావో
ప్రచురణకర్తనీలంరాజు వేంకటశేషయ్య
సంపాదకులునీలంరాజు వేంకటశేషయ్య
స్థాపించినది1949
భాషతెలుగు
కేంద్రంమద్రాసు

విషయాలు మార్చు

ఈ పత్రిక 18-7-1948 సంచిక[1]లో ఈ క్రింది అంశాలున్నాయి.

  1. కాంగ్రెసు పునీతం కావాలి (సంపాదకీయం)
  2. కాంచనమే కర్మవిమోచనం దొరా - చుండి జగన్నాథం
  3. చివరికి మిగిలేది (కథ) - బుచ్చిబాబు
  4. పేకమేడలు (బీదల కథలు) - ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.
  5. అరవ మంత్రుల ప్రచారాన్ని అరికట్టాలి - డా|| లంకా సుందరం
  6. ఆహ్వానం (కవిత) - బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి
  7. మహాపురుషుడు - అడివి బాపిరాజు
  8. అల్లరి పిల్ల - డి.వెంకటరత్నమ్మ
  9. ప్రాంతీయ భాష - మాతృభాష - గుడిపాటి శ్రీహరికృష్ణ
  10. గుడిగంటలు (కథ) - గోవిందరాజు సుందర్రావు
  11. జీవితేచ్ఛ (అనువాదం) - యన్.యస్.పడ్కే

మూలాలు మార్చు

  1. నీలంరాజు, వేంకటశేషయ్య (1948-07-18). "నవోదయ". నవోదయ. 3 (20): 1–36. Archived from the original on 2016-03-05. Retrieved 8 March 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=నవోదయ&oldid=3878883" నుండి వెలికితీశారు