నువ్వొస్తానంటే నేనొద్దంటానా

2005 సినిమా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవా దర్శకత్వంలో 2005 లో విడుదలైన సినిమా. ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఒక ధనవంతుల కొడుకైన కథానాయకుడు వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను మెప్పించడం ఈ చిత్ర కథాంశం.[1] ఈ చిత్రం తొమ్మిది భాషల్లోకి పునర్నిర్మితం (రీమేక్) అయింది.[2]

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
దర్శకత్వంప్రభు దేవా
రచనపరుచూరి సోదరులు, సందీప్ మలాని,
ఎం. ఎస్. రాజు
నిర్మాతఎం. ఎస్. రాజు
తారాగణంసిద్ధార్థ్,
త్రిష కృష్ణన్,
ప్రకాష్ రాజ్,
వేద,
శ్రీహరి
ఛాయాగ్రహణంవేణు గోపాల్
కూర్పుకె. వి. కృష్ణా రెడ్డి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
పంపిణీదార్లుసుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2005 జనవరి 14 (2005-01-14)
సినిమా నిడివి
165 ని.
భాషతెలుగు

కథ మార్చు

శివరామకృష్ణ, అతని చెల్లెలు సిరి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతారు. శివరామకృష్ణ ఆ ఊరి స్టేషన్ మాస్టర్ సాయంతో అప్పులో ఉన్న పొలాన్ని దక్కించుకుని వ్యవసాయం చేసుకుంటూ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. సిరి చిన్నప్పటి నుంచి లలిత అనే స్నేహితురాలు ఉంటుంది.

నటవర్గం మార్చు

 
సిద్ధార్థ్ నారాయణ్
 
త్రిష కృష్ణన్

పాటలు మార్చు

 
దేవి శ్రీ ప్రసాద్
  • చంద్రుళ్ళో ఉండే కుందేలు , శంకర మహదేవన్
  • సంథింగ్ సంథింగ్ , టీప్పు
  • ఆకాశం తాకేలా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పారిపోకే పిట్టా , మల్లికార్జున్, సాగర్
  • పాదం కదల నంటుందా , సాగర్
  • ప్రేమ కోసమై వలలో , ఘంటసాల
  • అదిరే అదిరే , జెస్సీ, కల్పన .
  • నిలువద్దo , కార్తీక్ , సుమంగళి.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "ఒక బస్తా ఎక్కువే పండిస్తా". sakshi.com. సాక్షి. Archived from the original on 13 November 2017. Retrieved 13 November 2017.
  2. "అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక చిత్రం! - nnn created history in remake". www.eenadu.net. Retrieved 2021-04-15.
  3. "నంది అవార్డు విజేతల పరంపర (1964 - 2008)" [A series of Nandi Award Winners (1964 - 2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 31 December 2020.(in Telugu)