సంతోషి (జననం 1987 మార్చి 31) భారతీయ నటి. బాలా (2002), జై (2004), హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (2006) చిత్రాలలో ఆమె నటనకు ప్రసిద్దిచెందింది. అలాగే, టీవీ సిరీస్ అరసి ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)లో తన పాత్రకు ఉత్తమ మహిళా హాస్యనటిగా నంది అవార్డును గెలుచుకుంది.[1][2]

సంతోషి
జననం
సంతోషి మోహన్‌రాజ్

(1987-03-31) 1987 మార్చి 31 (వయసు 37)
ఇతర పేర్లుసంతోషి, సంతోషిణి
వృత్తి
  • సినిమా నటి
  • టెలివిజన్ నటి
క్రియాశీల సంవత్సరాలు1995-ప్రస్తుతం

కెరీర్ మార్చు

సంతోషి చెన్నైలో గోపాల కృష్ణ మూర్తి, టెలివిజన్ నటి పూర్ణిమలకు జన్మించింది. ఆమె ఎనిమిదేళ్ల వయసులో, తన తల్లితో కలిసి టెలివిజన్ ధారావాహికలో మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం బాబా (2002)లో మనీషా కొయిరాలా సోదరిగా నటించింది. ఆ తరువాత, ఆమె ఆసై ఆశయై (2002), మారన్ (2002), మిలిటరీ (2003) వంటి సినిమాలలో ప్రధాన మహిళా పాత్రలను పోషించింది.

ఆమె సముద్రకని ఉన్నై చరణదైందేన్ (2003)లో రెండవ మహిళా ప్రధాన పాత్ర పోషించింది. జాతీయ చలనచిత్ర అవార్డు విజేత దర్శకుడు అగతియన్ దర్శకత్వం వహించిన కాదల్ సామ్రాజ్యంలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించింది.[3] ఆమె నవదీప్ సరసన జై (2004) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2006లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో కన్నడలో అడుగుపెట్టింది. ఆమె నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005), బంగారం (2006) వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలలోనూ నటించింది.

ఇక, 2007 నుండి, ఆమె ప్రసిద్ధ ధారావాహిక అరసిలో నటించింది, రాధిక పోషించిన సిరీస్ కథానాయిక అరసి కుమార్తె కలైఅరసి పాత్రను పోషించింది. టెలివిజన్ నటీమణుల కోసం నిర్వహించిన అందాల పోటీలో ఆమె "మిస్ చిన్నతిరై 2007" కిరీటాన్ని పొందింది.[4]

మూలాలు మార్చు

  1. "నంది అవార్డు విజేతల పరంపర (1964 - 2008)" [A series of Nandi Award Winners (1964 - 2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 31 December 2020.(in Telugu)
  2. "Nandi awards 2010 announced - Telugu cinema news".
  3. "Youthful line-up". The Hindu. Chennai, India. 5 July 2002. Archived from the original on 9 October 2003.
  4. "Santhoshi Crowned As Miss Chinnathirai 2007". Archived from the original on 30 April 2007. Retrieved 2009-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=సంతోషి&oldid=4037581" నుండి వెలికితీశారు