రాఘవ్ ఓంకార్ శశిధర్

[1]

Raghav Omkar Sasidhar
జననం
Sasidhar Pasalapudi

జాతీయతIndian
వృత్తిదర్శకుడు, రచయిత
తల్లిదండ్రులుగణేశ్వరరావు (తండ్రి), కళ (తల్లి)

రాఘవ్ ఓంకార్ శశిధర్ (ఆంగ్లం: Raghav Omkar Sasidhar), భారతీయ చలనచిత్ర దర్శకుడు , స్క్రీన్ రైటర్. ఓంకారం, లడ్డు, నన్ను క్షమించండివంటి స్వతంత్ర చిత్రాలకు (ఆంగ్లం: Independent films), దర్శకత్వం వహించి, అనేక అవార్డులను అందుకుని, చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన చలనచిత్రం 'ద 1OO'విడుదలకు సిద్ధమైంది, .[2] అసలు పేరు శశిధర్ పసలపూడి.

జీవిత విషయాలు మార్చు

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, కాకినాడలో రాఘవ్ ఓంకార్ శశిధర్ జన్మించారు. తండ్రిపేరు గణేశ్వరరావు, తల్లిపేరు కళ. ఏలూరు లోని సర్ సి. ఆర్ .రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బి.ఇ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) పూర్తిచేశారు. ముంబైలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సును చేసారు.[2]

సినిమాల్లో అనుభవం మార్చు

రాఘవ్ ఓంకార్ శశిధర్ ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర 6 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో సహాయ దర్శకుడిగా పనిచేశారు.[3] అప్పుడు కెమెరా ఆపరేటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ గురించి బాగా తెలుసుకున్నాడు. ఆ తరువాత కొన్ని వాణిజ్య, రాజకీయ ప్రకటనలు రూపొందించారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ‘గుండెల్లో గోదారి’కి స్క్రిప్ట్ విభాగంలో పనిచేశారు.

దర్శకత్వం చేసినవి మార్చు

  • ఫ్రెండ్స్: రాఘవ్ ఓంకార్ శశిధర్ మొదటగా "ఫ్రెండ్స్" అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడి 63 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను గెలుచుకుంది.
  • ఓంకారం: కృష్ణవంశీ దగ్గర పనిచేస్తున్న సమయంలోనే “ఓంకారం” అనే 120 నిమిషాల ఇండిపెండెంట్ ఎడ్యుకేషనల్ టెలిఫిల్మ్ కు దర్శకత్వం వహించారు. ఇది 2010లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి 2 టీవి నంది రాష్ట్ర అవార్డులు, 43 అంతర్జాతీయ అవార్డులు  గెలుచుకుంది.[1]
  • లడ్డు..ఎ స్వీట్ మెమరీ: బీపీ, షుగర్ ఉన్నవారికి కలిగే బాధ వంటి సున్నితమైన విషయంపై ‘లడ్డు..ఎ స్వీట్ మెమరీ’ పేరుతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఇందులో వయసు పైపడిన జనార్దన్ పాత్రలో రవివర్మ అడ్డూరి, వెంకీ, సుధీర్ బాబులు నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చాడు.[4] ఇది 2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి ఉత్తమ టీవీ సామాజిక సంబంధిత చిత్రం కింద నిర్మాతగా గోల్డెన్ నంది, దర్శకుడిగా కాంస్య నంది, ఉత్తమ గ్రాఫిక్స్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ కేటగిరీలలో 4 టీవి నంది రాష్ట్ర అవార్డులు గెలుచుకుంది. తాన తెలుగు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, వర్జిన్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ సినీఫెస్ట్, ఇంటర్నేషనల్ కల్ట్ ఫిల్మ్ ఫెస్ట్ కోల్‌కతా, ఎన్ఇజెడ్ ఇంటర్నేషనల్ కల్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో అవార్డ్స్ 112 అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు గెలుచుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన 9 ఫిల్మ్ ఫెస్ట్‌లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవార్డును పొందింది.[5]
  • నన్ను క్షమించండి: తండ్రి గొప్పతనాన్ని, విలువను తెలియజేస్తూ రాఘవ్ ఓంకార్ శశిధర్ తీసిన ‘నన్ను క్షమించండి’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ కు 191 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు & ఎన్ఇజెడ్ గోల్డెన్ డైరెక్టర్స్ అవార్డ్ 2020 గెలుచుకుంది.[2]
  • ప్రస్తుతం క్రియా ఫిలిం కార్పొరేషన్, ధమ్మ బ్యాన‌ర్‌లో ఆర్కే సాగర్ హీరోగా 'ద 1OO' అనే సినిమాకు దర్శకత్వం వహించారు, త్వరలో విడుదలకు సిద్ధం గా ఉంది, .[6][7]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 2011 సెప్టెంబరు 14వ తేదీన ఆంధ్రభూమి హైదరాబాద్ పేపర్లో వచ్చిన ''టీవీ నంది గెల్చుకున్న ఓంకారం'' అనే న్యూస్ నుండి
  2. 2.0 2.1 2.2 "#BehindTheCamera! Director Raghav Omkar Sasidhar: Global audiences are finally witnessing the kind of real talent the Telugu film industry can produce". The Times of India. 2022-04-17. ISSN 0971-8257. Retrieved 2023-06-26.
  3. "కృష్ణవంశీ ప్రభావం నాపై చాలా ఉంది : 'లడ్డు' దర్శకుడు శశిధర్ |". 2016-09-27. Retrieved 2023-06-26.
  4. "'లడ్డు'... ఓ తీయటి షార్ట్ ఫిల్మ్ - Filmy Focus". Filmy Focus. 2016-08-19. Retrieved 2023-06-26.
  5. "Laddu won 4 Nandi TV Awards 2016". www.ragalahari.com. 2018-05-09. Retrieved 2023-06-26.
  6. Vardhan, Harsha (2021-08-11). "RK Sagar, Raghav Omkar Sasidhar, RK Media Works 'The 100' Title Poster Revealed". Social News XYZ. Retrieved 2023-06-26.
  7. "TV star RK Sagar turns cop in 'The 100'". 123telugu.com. 2021-08-11. Retrieved 2023-06-26.

ఇతర లంకెలు మార్చు

  1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాఘవ్ ఓంకార్ శశిధర్ పేజీ