నా పేరు అయినపూడి వెంకట కృష్ణారావు. నాది ఘంటసాల గ్రామం. ఇది క్రిష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ లొ వుంది. నా వయసు 20.2.2008 నాటికి అర్ధ శతకం నిందుతాయి. ఆరడుగుల ఒక అంగుళం పొదవుంటాను. నల్లగా వున్నా మా అమ్మకి నేను చాలా అందంగా వుంటాను. నేను ఆంధ్రాబ్యాంక్ స్టాఫ్ కాలేజీ హయదరాబాద్ లొ సీనియర్ మానేజర్ (ట్రయినింగు) గా పనిచేస్తునాను. పెళ్ళయింది. ఇద్దరు పిల్ల్లలు.ఆమ్మాయికి 20 సంవత్సరాలు. బి ఫార్మసీ నాల్గవ సంవత్సరం చదువుతొంది. ఉన్నత చదువులకొసం అమెరికా వెళ్ళె ప్రయత్నంలొ వుంది. పిల్లవాదు ఇంటర్ రెండవ సంవత్సరం చడువుతున్నాదు.భార్య సంధ్య.నా ఫస్టు బెస్ట్ ఫ్రెంద్. నా తల్లి తండ్రులు కమలాకృస్ణ,రామమోహన్ రావులు.నాకు ఒక చెల్లెలు జ్యొతిర్మయి(45),ఒక తమ్ముదు డా.రవిశంకర్ (42)ఉన్నారు.పెళ్ళిళ్ళయి వాళ్ళిద్దరూ అమెరికాలో వున్నారు. నమ్మండి కమలాకృష్ణ నా కొసమే వాల్లిద్దరినీ కన్నదంటీ ఇసుమంత అతిశయోక్తి లేదు.

ఉద్యొగరీత్యా భారతదేశంలో భుబనేశ్వర్,కలకత్తా, బెంగలూరు తో పాటు బందరు,చల్లపల్లి,పామర్రు(కృస్ణాజిల్లా లోనివి)మరియు గుంటూరు,తెనాలి,తాడికొండ,గురజాల (గుంటూరు జిల్లా లోనివి)కరీంనగరం లలో పనిచేశాను.