మాతృభాష: నీ మాతృభాషను గౌరవించు. నువ్వు ఎవరితోనైనా ఏదయినా విషయం చెప్పినా, వాళ్ళు అర్థం చేసుకొనే భాషలో మాట్లాడితే కొంతవరకే అర్థం చేసుకుంటారు. వాళ్ళ మాతృభాషలో చెప్పగలిగితే అది వాళ్ల హృదయానికి హత్తుకుంటుంది. ఎప్పటికి వాళ్ళ మనస్సులో నాటుకు పోతుంది. ప్రపంచంలో ఇంగ్లీష్ మాతృభాషగా వున్నవారు 5% మంది కంటే తక్కువ. ఇంగ్లీష్ ఒక మాధ్యమము మాత్రమే. ప్రపంచ బాషలలో భారతీయ భాషలు 20% వాడుకలో ఉన్నాయ్. ఆత్మీయ సంభాషణం మాతృభాషతోనే సాధ్యం. మాతృభాషలోనే మాట్లాడదాం. అమ్మలాంటి కమ్మనైనది మాతృభాష.Pkraja1234 (చర్చ) 06:40, 28 మార్చి 2022 (UTC)