అంగద కన్హర్
అంగద కన్హర్ (జననం: 1964 ఏప్రిల్ 12) ఒక భారతీయ రాజకీయవేత్త. ఒడిశా శాసనసభకు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసాడు. ఆయన 2019లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికలలో 16వ ఒడిశా శాసనసభకు ఫుల్బాని శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 58 ఏళ్ల వయసులో అంగద కన్హర్ 2022లో పదో తరగతి పరీక్షలు రాసి అందరి దృష్టిని ఆకర్శించాడు.[1]
అంగద కన్హర్ | |
---|---|
ఒడిశా శాసనసభ | |
In office 2019–2024 | |
అంతకు ముందు వారు | దుగుని కన్హర్ |
నియోజకవర్గం | ఫుల్బాని శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | బిజు జనతాదళ్ |
సంతానం | 5, ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
1983లో రాజకీయాల్లో అడుగుపెట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా అంగద కన్హర్ సాధారణ రైతులా వ్యవసాయం చేస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. ఆయనతో పాటు భార్య సుకాంతి కన్హర్, కుమారుడు పూర్ణచంద్ర కన్హర్, కోడలు జ్యోతిర్మయి ప్రధాన్ కలిసి పంటలు సాగు చేస్తున్నారు. ఫిరింగియా బ్లాక్‌లోని తన గ్రామంలో ఆయనకు 29 ఎకరాల భూమి ఉండగా, అందులో 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ప్రారంభ జీవితం
మార్చుఅంగద కన్హర్ 1964 ఏప్రిల్ 12న జన్మించాడు. అతని తండ్రి సుబిన్ కన్హర్.[2]
రాజకీయ జీవితం
మార్చుఅంగద కన్హర్ ఒడిశా రాజకీయాల్లో బిజూ జనతా దళ్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆయన ఒడిశా శాసనసభ ఎమ్మెల్యేగా పనిచేసాడు.[2]
2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో, ఆయన ఫుల్వాలి శాసనసభ నియోజకవర్గం నుండి బిజు జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.[3] ఈ ఎన్నికల్లో, ఆయన 10,818 ఓట్లు పొంది 16వ ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన కిషోర్ కహర్‌పై 7.917 ఓట్లతో విజయం సాధించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Angada Kanhar: 58 ఏళ్ల వయసులో.. పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే.. | 58-year-old-odisha-mla-appears-for-class-x-exam-says-his-wish-got-fulfilled". web.archive.org. 2024-11-27. Archived from the original on 2024-11-27. Retrieved 2024-11-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 2.0 2.1 "Shri Angada Kanhar". odishaassembly.nic.in. Odisha Assembly. Retrieved 15 April 2021.
- ↑ Bhuyan, Sunil (25 March 2019). "ଦ୍ୱିତୀୟ ପର୍ଯ୍ୟାୟର ବଳକା ୨ଟି ଆସନ ପାଇଁ ବିଜେଡିର ପ୍ରାର୍ଥୀ ଘୋଷଣା". Kanak News (in ଓଡ଼ିଆ). kanaknews.com. Archived from the original on 26 September 2020. Retrieved 17 April 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "ଜି.ଉଦୟଗିରିରେ ସାଲୁଗା, ବାଲିଗୁଡ଼ାରେ ଚକ୍ରମଣି, ଫଲବାଣୀରେ ଅଙ୍ଗଦ ଆଗରେ". ଧରିତ୍ରୀ. ଜି.ଉଦୟଗିରି: www.dharitri.com. 23 May 2019. Retrieved 17 April 2021.