భారత జాతీయ కాంగ్రెస్

భారతదేశపు రాజకీయ పార్టీల్లో ఒకటి

భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. ప్రస్తుతం  సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకేఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు.

భారత జాతీయ కాంగ్రెసు
స్థాపన28 డిసెంబరు 1885
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
సిద్ధాంతంసామ్యవాద ప్రజాతంత్రం / జనాదరణ
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
0 / 175
తెలంగాణా అసెంబ్లీ
6 / 119
లోక్‌సభ
51 / 545
రాజ్యసభ
36 / 245
ఓటు గుర్తు
పార్టీ గుర్తు హస్తం
వెబ్ సిటు
కాంగ్రెస్.ఆర్గ్.ఇన్

చరిత్ర మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సిఉంది.కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 న స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.

సాధారణ ఎన్నికలలో మార్చు

సంవత్సరం సాధారణ ఎన్నిక గెలిచిన సీట్లు సీట్లలో మార్పు ఓట్ల % ఓట్ల మొగ్గు
భారత సాధారణ ఎన్నికలు, 1951 1వ లోక్‌సభ 364 - 44.99% -
భారత సాధారణ ఎన్నికలు, 1957 2వ లోక్‌సభ 371  7 47.78%   2.79%
భారత సాధారణ ఎన్నికలు, 1962 3వ లోక్‌సభ 361  10 44.72%   3.06%
భారత సాధారణ ఎన్నికలు, 1967 4వ లోక్‌సభ 283  78 40.78%   2.94%
భారత సాధారణ ఎన్నికలు, 1971 5వ లోక్‌సభ 352  69 43.68%   2.90%
భారత సాధారణ ఎన్నికలు, 1977 6వ లోక్‌సభ 153  199 34.52%   9.16%
భారత సాధారణ ఎన్నికలు, 1980 7వ లోక్‌సభ 351   198 42.69%   8.17%
భారత సాధారణ ఎన్నికలు, 1984 8వ లోక్‌సభ 415   64 49.01%   6.32%
భారత సాధారణ ఎన్నికలు, 1989 9వ లోక్‌సభ 197  218 39.53%   9.48%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10వ లోక్‌సభ 244   47 35.66%   3.87%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11వ లోక్‌సభ 140   104 28.80%   7.46%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12వ లోక్‌సభ 141   1 25.82%   2.98%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13వ లోక్‌సభ 114   27 28.30%   2.48%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14వ లోక్‌సభ 145   32 26.7%   1.6%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15వ లోక్‌సభ 206   61 28.55%   2.02%
2014 భారత సార్వత్రిక ఎన్నికలు 16వ లోక్‌సభ 44   162 19.52%   9.53%
2019 భారత సార్వత్రిక ఎన్నికలు 17వ లోక్‌సభ 52   8 19.01%   0.51%
1వ లోక్‌సభ నుండి 17 వ లోక్‌సభ వరకూ సాధించిన స్థానాలు
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెల మార్చు