అంజలీ మీనన్
అంజలీ మీనన్ ప్రముఖ భారతీయ సినీ దర్శకురాలు, సినీ రచయిత్రి. మలయాళ చిత్రం మంజదికురు సినిమాతో దర్శకురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఆమె. ఈ సినిమాకు అంజలి అంతర్జాతీయ ఫిలిం క్రిటిక్ ఫెడరేషన్ నుండి ఉత్తమ మలయాళ చిత్రం, ఉత్తమ భారతీయ తొలి చిత్రం పురస్కారాలు అందుకున్నారు అంజలి.[2] ఆమె రెండో చిత్రం బెంగుళూర్ డేస్ మంచి హిట్ అయింది. ఆ తరువాత ఉస్తాద్ హొటల్ సినిమాకు రచన చేశారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయంగా నిలవడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందింది.
అంజలీ మీనన్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | లండన్ ఫిల్మ్ స్కూల్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | వినోద్ మీనన్ |
పిల్లలు | 1 |
ఆమె దుబాయ్లో పెరిగారు. పూణె విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు ఆమె.[3] 2003లో లండన్ ఫిలిం స్కూల్ లో డిగ్రీ చేసిన అంజలి, ఎడిటింగ్, నిర్మాణం సినీ దర్శకత్వ శాఖల్లో డిస్టింక్షన్ హానర్ పొందారు.[4][5] ఆమె గ్రాడ్యుయేషన్ సమయంలో రేజ్ కెంప్టన్, అర్చే పంజాబీలతో, ఆసిఫ్ కపాడియా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా తీసిన బ్లాక్ నార్ వైట్ చిత్రం పాం స్ప్రింగ్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది.[6]
భారతదేశం, మధ్య ఆసియా, యుకెలలో షార్ట్ ఫిక్షన్, డాక్యుమెంటరీ ప్రాజెక్టులతో తన కెరీర్ ను ప్రారంభించారు అంజలీ. 2006లో ముంబైలో వినోద్ మీనన్ తో కలసి లిటిల్ ఫిలింస్ ఇండియా పేరుతో ఫిలిం కంపెనీ మొదలుపెట్టారు.[4] ఆమె స్క్రీన్ ప్లే రచయితగానే కాక కథానికలు కూడా రాశారు. మాన్ సూన్ ఫీస్ట్ అనే కథానికల సంకలనంలో ఆమె కథ ఒకటి ప్రచురితమైంది. ఆమె భర్త, కొడుకుతో పాటు ముంబైలో నివసిస్తున్నారు అంజలి.
సినిమాలు
మార్చుఏడాది | సినిమా | Director | Screenwriter | Ref. |
---|---|---|---|---|
2009 | కేరళా కేఫ్(హ్యాపీ జర్నీ సిగ్మెంట్) | [7] | ||
2012 | మంజదికురు | [8] | ||
2012 | ఉస్తాద్ హోటల్ | [9] | ||
2015 | బెంగుళూర్ డేస్ | [10] |
పురస్కారాలు
మార్చు- జాతీయ సినీ పురస్కారం
- 2012 - 60వ జాతీయ సినీ పురస్కారాలు - ఉత్తమ మాటల రచయిత పురస్కారం(ఉస్తాద్ హోటల్)[11]
- 2013 - ఏషియానెట్ సినీ పురస్కారాలు - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత పురస్కారం(ఉస్తాద్ హోటల్)
- 2015 - ఫిలింఫేర్ పురస్కారాలు - ఉత్తమ దర్శకురాలు(బెంగుళూర్ డేస్)[12]
- 2015 - ఏషియానెట్ సినీ పురస్కారాలు - ఉత్తమ దర్శకురాలు (బెంగుళూర్ డేస్), ఉత్తమ ప్రముఖ చిత్రం (బెంగుళూర్ డేస్)[13]
- 2015 - వనితా సినీ పురస్కారం - ఉత్తమ దర్శకురాలు(బెంగుళూర్ డేస్), ఉత్తమ ప్రముఖ చిత్రం[14]
- 2015 - సీమా సినీ పురస్కారాలు - ఉత్తమ దర్శకురాలు(బెంగుళూర్ డేస్), ఉత్తమ సినిమా[15]
- అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ పురస్కారాలు, ఎంపికలు
మూలాలు
మార్చు- ↑ "Anjali Menon's 'Bangalore Days' creates history - Entertainment News , Firstpost". Firstpost. 9 జూన్ 2014. Retrieved 5 మార్చి 2021.
- ↑ "Parque Via wins best film award". The Hindu. Archived from the original on 25 జనవరి 2009. Retrieved 19 మే 2012.
- ↑ "Cut to Anjali". The Hindu. 12 సెప్టెంబరు 2009. Archived from the original on 23 సెప్టెంబరు 2009. Retrieved 17 డిసెంబరు 2009.
- ↑ 4.0 4.1 Lucky Red Seeds and Profile NFDC
- ↑ "Anjali Menon's First Feature Wins Awards". London Film School News. 28 మే 2009. Archived from the original on 19 జూన్ 2009. Retrieved 17 డిసెంబరు 2009.
- ↑ "Black Nor White website". Archived from the original on 26 జూన్ 2015. Retrieved 7 జనవరి 2017.
- ↑ "Review: Kerala Cafe". Sify. Archived from the original on 1 జూలై 2016. Retrieved 7 జనవరి 2017.
- ↑ "Seeds of a success story". The Hindu. 26 డిసెంబరు 2008.
- ↑ Nagarajan, Saraswathy (21 జూన్ 2012). "Beachside hotel". The Hindu. Archived from the original on 27 జూలై 2012. Retrieved 7 జనవరి 2017.
- ↑ "Anjali Menon's movie is Bangalore Days". The Times of India. 24 జనవరి 2014.
- ↑ ":: National Film Award 2012 ::" (PDF). India Government. Retrieved 1 మే 2015.
- ↑ "Filmfare Awards South".
- ↑ "Asianet Film Awards".
- ↑ "Vanitha Film Awards 2015". Archived from the original on 22 ఏప్రిల్ 2016. Retrieved 7 జనవరి 2017.
- ↑ "SIIMA awards 2015". Archived from the original on 27 సెప్టెంబరు 2015. Retrieved 7 జనవరి 2017.
- ↑ ":: IFFK 2008 ::". Iffk.keralafilm.com. Archived from the original on 17 ఫిబ్రవరి 2015. Retrieved 30 డిసెంబరు 2014.
- ↑ http://www.thehindu.com/todays-paper/parque-via-wins-best-film-award/article1398455.ece
- ↑ "Awards - Festival Awards 2008". Fipresci. Archived from the original on 8 అక్టోబరు 2014. Retrieved 30 డిసెంబరు 2014.
- ↑ "Festival Reports - Kerala 2008 - "Lucky Red Seeds"". Fipresci. Archived from the original on 16 అక్టోబరు 2013. Retrieved 30 డిసెంబరు 2014.