అంజాద్ భాషా షేక్ బెపారి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి

ఆంజాద్‌ బాషా షేక్ బెపారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2019 జూన్ 8న ఉప ముఖ్యమంత్రిగా, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[1][2]

ఆంజాద్‌ బాషా షేక్ బెపారి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2019
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
బిశ్వభూషణ్ హరిచందన్

పదవీ కాలం
8 జూన్ 2019 – ప్రస్తుతం
గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్
బిశ్వభూషణ్ హరిచందన్
ముందు నాస్యం మహమ్మద్ ఫరూఖ్

శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
ముందు అహమ్మదుల్లా మొహమ్మద్ సయ్యద్
నియోజకవర్గం కడప నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1971-08-12) 1971 ఆగస్టు 12 (వయసు 52)
కడప, ఆంధ్రప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు అబ్దుల్‌ ఖాదర్‌ షేక్‌ బెపారి, నూర్జహాన్‌ బేగం
జీవిత భాగస్వామి నౌరిన్‌ ఫాతిమా
సంతానం జైబా జువేరియా
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

ఆంజాద్‌ బాషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపలో 1971 ఆగస్టు 12లో అబ్దుల్‌ ఖాదర్‌ షేక్‌ బెపారి, నూర్జహాన్‌ బేగం దంపతులకు జన్మించాడు. ఆయన 1985లో నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదవ తరగతి, 1988లో కడప, మరియాపురంలోని సెయింట్‌ జోసెఫ్స్‌ జూనియర్‌ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి బీఏ పూర్తి చేశాడు.[3][4][5]

రాజకీయ జీవితం మార్చు

ఆంజాద్‌ బాషా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచాడు. ఆయన 2014, 2019 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి,, 2019 జూన్ 8న ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[6]

మూలాలు మార్చు

  1. TV9 Telugu (8 June 2019). "మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్ - TV9 Telugu CM YS Jagan are allocated Departments to Cabinet Ministers". TV9 Telugu. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The New Indian Express (8 June 2019). "Full list of Andhra Pradesh Ministers as YSRCP cabinet under Jagan sworn in". The New Indian Express. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  3. BBC News తెలుగు (8 June 2019). "జగన్ క్యాబినెట్‌: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  4. Sakshi (8 June 2019). "అంజాద్‌బాషాకు అగ్రపీఠం..!". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  5. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  6. The News Minute (8 June 2019). "Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen". The News Minute. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.