అంజు చధా

భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త.

అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యురాలుగా పనిచేసింది.[1]

అంజు చధా
అంజు చధా
జననంఅహ్మద్ నగర్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
రంగములురసాయన శాస్త్రం (జీవ రసాయన శాస్త్రం)
వృత్తిసంస్థలుఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌
చదువుకున్న సంస్థలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్

అంజు చధా అహ్మద్ నగర్‌లో 1955, మే 4వ తేదీన జన్మించింది.[2]

విద్యార్హతలు

మార్చు
  • 1972 - 1975లో నౌరోస్జీ వాడియా కళాశాల, పూణే విశ్వవిద్యాలయంలో బియస్సీ కెమిస్ట్రీ చదివింది.[3]
  • 1975 - 1977లో పూణే విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది.
  • 1979 - 1984లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో బయోఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్.డి పూర్తిచేసింది.[4]

గౌరవాలు , అవార్డులు

మార్చు
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2011 మార్చి 8న సైన్స్ రంగంలో పనిచేసినందుకు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు లభించింది.
  • 1992-1993లో జర్మనీవారి అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫెలోషిప్ లభించింది.[4]
  • 1985-1988లో NIH, యుఎస్ఏ వారి ఫగర్టీ అట్ అంతర్జాతీయ ఫెలోషిప్ లభించింది.[4]
  • 1985లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూర్ వారిచే సైన్స్ ఫ్యాకల్టీలో ఉత్తమ థీసిస్ కోసం శ్రీమతి హనుమంతరావు మెడల్ లభించింది.[3]
  • 1975-1977లో మహారాష్ట్ర ప్రభుత్వంవరారి స్కాలర్ షిప్ లభించింది.
  • 1975లో నౌరోస్జీ వాడియా కళాశాల, పూణేలో కెమిస్ట్రీ విభాగంలో కాలేజ్ లో మొదటి బహుమతి లభించింది.[3]
  • 1972లో సెంట్రల్ పాఠశాల, దేహు రోడ్ ఉత్తమ విద్యార్థి, కెమిస్ట్రీ బహుమతి లభించాయి.

మూలాలు

మార్చు
  1. "Anju Chadha". Retrieved 22 December 2020.
  2. "Science – a joyous playing field" (PDF). Retrieved 22 December 2020.
  3. 3.0 3.1 3.2 "Anju Chadha". Archived from the original on 27 May 2009. Retrieved 22 December 2020.
  4. 4.0 4.1 4.2 "Anju Chadha". Retrieved 22 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=అంజు_చధా&oldid=4225859" నుండి వెలికితీశారు