ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లేదాభారతీయ విజ్ఞాన సంస్థానం ఉన్నత విద్య (post-graduation, doctorial), పరిశోధనల కొరకు నిర్దేశింపబడిన భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో నెలకొని ఉంది. కరెంటు సైన్సు జర్నలు ఇచ్చిన కోటి (Rank) ప్రకారం పరిశోధనా ఉత్పత్తిలో (citation and impact factor) ఇది భారతదేశంలో ప్రథమ స్ధానంలో నిలిచింది.
చరిత్రసవరించు
1893 లో ఒకసారి జంషెడ్జీ టాటా నౌకలో ప్రయాణిస్తుండగా ఆయన యాధృచ్చికంగా స్వామీ వివేకానందను కలవడం జరిగింది. ఉక్కు పరిశ్రమను భారత్ కు రప్పించడం గురించి వారిరువురూ కొద్దిసేపు చర్చించడం జరిగింది. ఆతరువాత ఐదేళ్ళకు టాటా వివేకానందకు ఇలా లేఖ రాశారు.
“ | మీరు జపాన్ నుంచి షికాగో వెళుతున్నపుడు మీతోటి ప్రయాణికుడిగా నన్ను గుర్తుంచుకున్నారనుకుంటాను. భారతదేశంలో ఆధ్యాత్మికతను గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకింకా గుర్తున్నాయి. అదే స్పూర్థితో మన దేశంలో సైన్సు పరిశోధనాసంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.... ” | ” |
సైన్సుపై స్వామీ వివేకానంద అభిప్రాయాలకు, ఆయన నాయకత్వ లక్షణాలకు ముగ్ధుడైన టాటా ఆయన ప్రయత్నంలో సహాయపడవలసిందిగా కోరాడు. వివేకానంద ఎంతో సంతోషంగా అందుకు అంగీకరించాడు. భారతదేశంలో సైన్సు అభివృద్ధే లక్ష్యంగా పరిశోధన, ఉన్నత విద్యకోసం ఒక సంస్థను స్థాపించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ 1898, డిసెంబరు 31 న డ్రాఫ్టు ప్రతిపాదనను అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ను సమర్పించింది. తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత ఐన సర్ విలియం రామ్సేను సంస్థ స్థాపించేందుకు అనువైన ప్రదేశాన్ని సూచించవలసిందిగా కోరడం జరిగింది. ఆయన బెంగళూరు అందుకు అనువైన స్థలంగా పేర్కొన్నారు.
సంస్థ గురించిసవరించు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నే టాటా ఇన్‌స్టిట్యూట్ అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.
ప్రాంగణంసవరించు
సంస్థ ప్రాంగణమంతా పచ్చదనంతో అలరారుతుంటుంది.